‘Operation Trace’ By AP Police | ‘ఆపరేషన్ ట్రేస్’ సత్ఫలితాలు ఇస్తుందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం స్పష్టం చేసింది. తప్పిపోయిన, అపహరణకు గురైన బాలికల ఆచూకీ కనిపెట్టి వారి కుటుంబ సభ్యుల చెంతకు చేర్చేందుకు ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖ ‘ఆపరేషన్ ట్రేస్’ ను చేపట్టింది.
ఆచూకీ లభ్యమైన బాలికల్లో 80 శాతం మంది 14 నుంచి 18 ఏళ్ల మధ్య వారే ఉన్నారని ప్రభుత్వం పేర్కొంది. అసాంఘిక శక్తుల బారిన పడకుండా వీరిని పోలీసులు కాపాడగలిగారంది. జులై 30 నాటికి 1065 బాలికల మిస్సింగ్ కేసులు పెండింగ్ లో ఉన్నాయి.
ఆపరేషన్ ట్రేస్ చేపట్టిన పోలీసులు కేవలం ఒక్క నెలలోనే 670 కేసులను ఛేదించారు. బాలికలకు సురక్షితంగా వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఇంకా 395 కేసులు పెండింగ్ లో ఉన్నాయి. పార్వతీపురం మన్యం జిల్లా బాలికల మిస్సింగ్ కేసుల చెదనలో అగ్రగామిగా నిలిచింది. ఆ తర్వాత పల్నాడు జిల్లా ఉంది.









