‘Only PM Modi works 100 hours a week’ | తనకు తెలిసి వారానికి 100 గంటలు పనిచేసే ఏకైక వ్యక్తి ప్రధాని మోదీ అని ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి చెప్పినట్లు బీజేపీ ఎంపీ తేజస్వి సూర్య వెల్లడించారు.
ఈ మేరకు తేజస్వి సోషల్ మీడియా వేదికగా పోస్ట్ చేశారు. ముంబయి నుంచి బెంగళూరుకు వచ్చే క్రమంలో నారాయణమూర్తితో కలిసి ప్రయాణించినట్లు బీజేపీ ఎంపీ తెలిపారు. ఉపాధి నైపుణ్యాలు, ఏఐ, నగరాల ప్రస్తుత స్థితి, నాయకత్వం ఇలా పలు అంశాలపై ఆయనతో చర్చించినట్లు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా ‘మీరు చెప్పిన విధంగానే వారానికి 70 గంటలు పనిచేయడానికి ప్రయత్నిస్తున్నాను’ అని నారాయణమూర్తితో సరదాగా చెప్పినట్లు తేజస్వి సూర్య చెప్పారు. ఈ సమయంలో స్పందించిన నారాయణమూర్తి ‘తనకు తెలిసి వారానికి 100 గంటలు పనిచేసే ఏకైక వ్యక్తి ప్రధాని మోదీనే’ అని ఆయన కితాబిచ్చరని బీజేపీ ఎంపీ పోస్ట్ చేశారు.