Wednesday 4th December 2024
12:07:03 PM
Home > తాజా > కాంగ్రెస్ ఘన విజయానికి నేటితో ఏడాది

కాంగ్రెస్ ఘన విజయానికి నేటితో ఏడాది

One Year For Congress Victory In Telangana | తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ సాధించిన ఘన విజయానికి డిసెంబర్ మూడు ( Dec 3 )తో సరిగ్గా ఏడాది అయ్యింది.

గతేడాది నవంబర్ 30న ఒకే విడతలో రాష్ట్ర వ్యాప్తంగా శాసనసభ ఎన్నికలు జరిగాయి. అనంతరం డిసెంబర్ 3న ఫలితాలు వెలువడ్డాయి. ఈ ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ( Congress Party ) 64 స్థానాల్లో, మిత్రపక్షం సీపీఐ ( CPI ) ఒకచోట గెలిచాయి.

మరోవైపు సుమారు దశాబ్దం అధికారంలో కొనసాగిన గులాబీ పార్టీ కేవలం 39 స్థానాల్లో విజయం సాధించి ప్రతిపక్షానికి పరిమితం అయ్యింది. బీజేపీ ( BJP ) 8 చోట్ల, ఎంఐఎం ( AIMIM ) ఏడింట్లో విజయాన్ని సాధించాయి.

రేవంత్ రెడ్డి కొడంగల్ ( Kodangal ) నుండి ఎమ్మెల్యేగా గెలిచి ముఖ్యమంత్రి పదవిని చేపట్టారు, మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ( KCR ) గజ్వెల్ నుండి శాసనసభకు ఎన్నికయ్యారు. కానీ కేసీఆర్, రేవంత్ రెడ్డి ఇద్దర్ని కామారెడ్డిలో ఓడించిన వెంకటరమణ రెడ్డి ( K.V. Ramana Reddy ) పేరు దేశ వ్యాప్తంగా మారుమోగింది.

You may also like
కలకలం..మాజీ డిప్యూటీ సీఎంపై కాల్పులు
మెగాస్టార్ శ్రీకాంత్ ఓదెల కాంబోలో మూవీ.. ప్రీలుక్ వైరల్
తాను ఆహుతై..తెలంగాణకు వేగుచుక్కై
పుష్ప-3 కూడా ఉంది..ఫోటో వైరల్

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions