One Nation One Election Bill In Parliament | ‘ ఒకే దేశం-ఒకే ఎన్నిక ‘ కు సంబంధించిన బిల్లు లోక్సభ ( Loksabha ) ముందుకు వచ్చింది.
జమిలి ఎన్నికల బిల్లును కేంద్ర ప్రభుత్వం లోకసభలో మంగళవారం ప్రవేశపెట్టింది. లోక్సభకు, రాష్ట్రాల అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు జరపాలని కేంద్ర ప్రభుత్వం ముందుకు వెళ్తుంది.
దీనికోసం ప్రతిపాదించిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లు సహా మరో బిల్లును కేంద్రం లోకసభలో ప్రవేశపెట్టింది. కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రాం మేఘవాల్ ( Arjun Ram Meghwal )
ఈ బిల్లును ప్రవేశపెట్టారు.
ప్రస్తుతం దీనిపై సభలో చర్చ జరుగుతుంది. ఈ బిల్లు కోసం బీజేపీ ( Bjp ), కాంగ్రెస్ ( Congress ) సహా మరికొన్ని పార్టీలు విప్ ను జారీ చేసిన విషయం తెల్సిందే.