OG tickets to be sold at Rs.1000 for benefit show in AP | పవర్ స్టార్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ‘ఓజి’ మరికొన్ని రోజుల్లో విడుదలకు సిద్దంగా ఉంది. ఇందులో ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పవర్ఫుల్ గ్యాంగస్టర్ పాత్రలో కనిపించనున్నారు.
సుజీత్ తెరకెక్కించిన ఈ సినిమాలో ప్రియాంక మోహన్ హీరోయిన్. ఇకపోతే సెప్టెంబర్ 21న ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్ విడుదల కానుంది. ఇదే సమయంలో ఓజి టికెట్ ధరలు పెంచుకునేందుకు వీలుగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది.
ఈ మేరకు నిర్మాణ సంస్థ డీవీవీ ఎంటర్టైనమెంట్స్ విజ్ఞప్తి పై ప్రభుత్వం స్పందించింది. సెప్టెంబర్ 25 తెల్లవారుజాము ఒంటి గంటకు వేసే బెనిఫిట్ షో ధర రూ.1000గా పెంచుకునేందుకు అనుమతిని ఇస్తూ ప్రభుత్వం ఉత్తర్వుల్లో పేర్కొంది. అలాగే సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ నాలుగు వరకు జీఎస్టీతో కలిపి సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.125, మల్టీప్లెక్స్ ల్లో రూ.150 వరకు పెంచుకునేందుకు ప్రభుత్వం అనుమతించ్చింది.









