Monday 23rd March 2026
12:07:03 PM
Home > తాజా > వేలంలో రూ. లక్షల్లో ఓజీ సినిమా టికెట్ రేట్లు!

వేలంలో రూ. లక్షల్లో ఓజీ సినిమా టికెట్ రేట్లు!

og movie update

OG Ticket Price in Auction | ఏపీ డిప్యూటీ సీఎం, పవర్ స్టార్ పవన్ కల్యాణ్ (Pawan Kalyan) నటించిన తాజా చిత్రం ఓజీ. సుజిత్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో ఇమ్రాన్ హష్మీ, ప్రియాంక మోహన్ కీలక పాత్రల్లో నటించారు.

ఈ సినిమా సెప్టెంబర్ 25 న థియేటర్లలో విడుదల కానుంది. ఈ నేపథ్యంలో పవన్ కళ్యాణ్ పై ఆయన ఫ్యాన్స్ వినూత్నంగా తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. థియేటర్లలో మొదటి టికెట్ ను వేలం వేస్తూ లక్షల రూపాయలకు వాటిని సొంతం చేసుకుంటున్నారు.

అయితే ఆ మొత్తాన్ని చెక్కుల రూపంలో జనసేన పార్టీకి విరాళాలు అందిస్తున్నారు ఫ్యాన్స్. బెంగళూరులో ఓజీ టికెట్ ను రూ. 3.61 లక్షలు, చెన్నైలో రూ. 1.72 లక్షలు, చిత్తూరులో రూ. 1 లక్ష రూపాలయకు సొంతం చేసుకొని ఆ మొత్తాన్ని చెక్కుల రూపంలో ఎమ్మెల్సీ కె. నాగబాబు గారి చేతుల మీదుగా జనసేన పార్టీకి అందజేశారు.  

You may also like
rajendra prasad
క్షమాపణలు చెప్పండి.. ఇంతటితో ముగించండి!
pramodh shetty
రష్మిక తన పెళ్లికి మమ్మల్నిపిలవదని తెలుసు: ప్రమోద్ శెట్టి
chiranjeevi
నా విజయ రహస్యం నువ్వే అని చెబుతా.. చిరంజీవి ఎమోషనల్ పోస్ట్!
రాముడి గుడి కడితే మీరు ఒక ట్వీట్ అయినా చేశారా జగన్: నాగబాబు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions