Odisha Vigilance Unearths Cash Over Rs 4 Crore From Mines Department Official’s Flat | ఒడిశా రాష్ట్రంలో ఓ భారీ అవినీతి తిమింగళం బయటపడింది. అవినీతి అధికారి ఇంట్లో రూ.4 కోట్ల నోట్ల కట్టలను అధికారులు గుర్తించడం సంచలనంగా మారింది. ఆ రాష్ట్ర విజిలెన్స్ సోదాల్లో ఇంత భారీ మొత్తంలో డబ్బు లభ్యం అవ్వడం ఇదే తొలిసారి. ఒడిశా రాష్ట్రం గనుల శాఖ కటక్ సర్కిల్ డిప్యూటీ డైరెక్టర్ దేబబ్రత్ మహంతి ఇటీవల లంచం తీసుకుంటూ అధికారులకు చిక్కారు. లైసెన్స్ పొందిన ఓ బొగ్గు విక్రేత నుంచి రూ.30 వేలు లంచం తీసుకుంటూ అధికారులకు పట్టుబడ్డారు. దింతో కేసు నమోదు చేసిన అధికారులు మహంతి కార్యాలయం, ఇల్లు, అపార్ట్మెంట్ లో సోదాలు నిర్వహించారు. ఆయన ఇంట్లో ట్రాలీ బ్యాగుల్లో, అల్మారాలో రూ.4 కోట్ల నోట్ల కట్టలను అధికారులు గుర్తించారు. అలాగే ఆఫీసు టేబుల్ డెస్క్ లో మరో రూ.1.20 లక్షలు, భువనేశ్వర్ లో రెండంతస్థుల భవనం, 130 గ్రాముల బంగారాన్ని అధికారులు గుర్తించారు.










