Nude Video Call To Telangana MLA | గుర్తుతెలియని నంబర్ల నుండి కొందరు వీడియో కాల్స్ ( Video Call ) చేసి సైబర్ నేరాల ( Cyber Crimes )కు పాల్పడుతున్న విషయం తెల్సిందే. ఇటీవల కాలంలో ఇటువంటి నేరాలు అధికమయ్యాయి.
కేవలం సామాన్యులనే కాకుండా పెద్ద వారిని కూడా ఈ సమస్య వేదిస్తుంది. తాజాగా తెలంగాణలోని అధికార పార్టీ ( Telangana Congress )కి చెందిన ఎమ్మెల్యేకు సైతం ఇలా గుర్తు తెలియని నంబర్ నుండి న్యూడ్ వీడియో కాల్ ( Nude Video Call )చేశారు.
కరీంనగర్ ( Karimnagar ) కు చెందిన ఆ ఎమ్మెల్యేకు అక్టోబర్ 14 అర్ధరాత్రి ఓ గుర్తుతెలియని నంబర్ నుండి వాట్సప్ లో వీడియో కాల్ చేశారు. ఈ కాల్ కు ఎమ్మెల్యే ఆన్సర్ ( Answer ) చేశారు. ఒక్కసారిగా వీడియో కాల్ లో ఓ మహిళ నగ్నంగా దర్శనమిచ్చింది. ఆందోళనకు గురైన సదరు ఎమ్మెల్యే కాల్ ను కట్ చేశారు.
తనపై ఎవరైనా కుట్ర పన్నారా లేక నిజంగానే సైబర్ కేటుగాళ్ళు ఫోన్ చేశారా ? అనే అనుమానం ఎమ్మెల్యేకు కలిగింది. వెంటనే నేషనల్ సైబర్ క్రైం రిపోర్టింగ్ పోర్టల్ ( National Cyber Crime Reporting Portal )కు మరియు తెలంగాణ సైబర్ సెక్యూరిటీ బ్యూరో ( Telangana Cyber Security Bureau ) లో ఫిర్యాదు చేశారు. కేసును నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.