Tuesday 24th June 2025
12:07:03 PM
Home > తాజా > NTRNEEL..3000 వేల మందితో యాక్షన్ సీన్

NTRNEEL..3000 వేల మందితో యాక్షన్ సీన్

ntr neel movie

NTRNeel Movie Updates | యంగ్ టైగర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ ( Prashanth Neel ) కాంబోలో ఓ సినిమా తెరకెక్కుతున్న విషయం తెల్సిందే.

కేజీఎఫ్, సలార్ వంటి సినిమాలతో ఇండస్ట్రీని షేక్ చేసిన ప్రశాంత్ నీల్ ఇప్పుడు ఎన్టీఆర్ ను మునుపెన్నడూ చూడని మాస్ లుక్ లో చూపించనున్నట్లు తెలుస్తోంది. మైత్రి మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా సినిమాను నిర్మిస్తున్నాయి.

‘ఎన్టీఆర్ నీల్’ వర్కింగ్ టైటిల్ తో తెరకెక్కుతున్న సినిమాపై అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. కాగా మూవీకి సంబంధించిన షూటింగ్ హైదరాబాద్ రామోజీ ఫిల్మ్ సిటీలో గురువారం నుండి ప్రారంభం అయ్యింది.

సుమారు 3000 వేల మంది జూనియర్ ఆర్టిస్టులతో భారీ యాక్షన్ ఎపిసోడ్ ను షూట్ చేస్తున్నట్లు సినీ వర్గాలు చెబుతున్నాయి. పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా రాబోతున్న ఈ సినిమా షూటింగ్ లో ఎన్టీఆర్ వచ్చే నెల నుండి పాల్గొననున్నారు.

యాక్షన్ సీన్ కు సంబంధించిన ఫోటోను మూవీ టీం సోషల్ మీడియాలో షేర్ చేసింది. టెర్రిటరీ ఆఫ్ డిస్ట్రక్షన్ ( Welcome To Territory Of Destruction ) కు స్వాగతం అంటూ కాప్షన్ ఇచ్చారు. ఫోటోపై స్పందించిన ఎన్టీఆర్ సినిమా షూట్ మొదలైందని ప్రకటించారు.

You may also like
అత్తాపూర్ ఘటన..ఆర్టీసీ డ్రైవర్ కు సజ్జనర్ పరామర్శ
‘సోమర్ సాల్ట్ వేసేయ్..పంత్ కు గావస్కర్ రిక్వెస్ట్’
‘ఇజ్రాయిల్ కూడా రష్యన్ మాట్లాడే దేశమే’..పుతిన్ కీలక వ్యాఖ్యలు
టెస్టుల్లో 150 క్యాచులు..పంత్ పేరిట మరో రికార్డు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions