Notices Issued To Marri Rajashekar Reddy Colleges | హైదరాబాద్ ( Hyderabad ) లోని అక్రమ నిర్మాణాలపై హైడ్రా ( HYDRA ) ఫోకస్ పెట్టింది. ఇప్పటికే పలు నిర్మాణాలను నేలమట్టం చేశారు.
ఈ నేపథ్యంలో మల్కాజిగిరి ( Malkajgiri ) ఎమ్మెల్యే, మాజీ మంత్రి మల్లారెడ్డి ( Mallareddy ) అల్లుడు మర్రి రాజశేఖర్ రెడ్డి ( Marri Rajashekar Reddy )కి చెందిన కాలేజీలకు రెవెన్యూ అధికారులు నోటీసులు ఇవ్వడం సంచలనంగా మారింది.
దుండిగల్ ( Dundigal ) లోని ఎంఎల్ఆర్ఐటీ ( MLRIT ) కాలేజీకి మరియు ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఏరోనాటికల్ ఇంజనీరింగ్ కాలేజీకి నోటీసులు వెళ్లాయి. చిన్న దామెరచెరువు ఎఫ్టీఎల్ ( FTL ), బఫర్ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు.
మొత్తం 8 ఎకరాల 24 గుంటల చెరువు భూమిని ఆక్రమించినట్లు నోటీసుల్లో అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో ఏడు రోజుల్లో నిర్మాణాలను తొలగించాలని లేదంటే తామే చర్యలు తీసుకుంటామని రెవెన్యూ అధికారులు నోటీసుల్లో స్పష్టం చేశారు.
చెరువు భూముల్లో బిల్డింగ్స్, షెడ్స్,వెహికల్ పార్కింగ్ తో పాటు రోడ్లు కూడా వేసినట్లు అధికారులు పేర్కొన్నారు.