No Immediate Changes In AP Intermediate Education | ఆంధ్రప్రదేశ్ లో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ( First Year ) పరీక్షలు 2025-26 సంవత్సరం నుండి రద్దు కానున్నాయి అని బుధవారం కథనాలు వెలువడ్డాయి.
అయితే ఈ అంశంపై ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఫాక్ట్ చెక్ ( Fact Check ) విభాగం స్పష్టం చేసింది. ఇంటర్ విద్యకు సంబంధించి కేవలం సలహాలు సూచనలు మాత్రమే కోరినట్లు వివరణ ఇచ్చారు.
‘ ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షలు రద్దు అంటూ కొంతమంది చేస్తున్న ప్రచారం అబద్ధం. ఇంటర్మీడియట్ విద్యకు సంబంధించి కొన్ని సంస్కరణలను తీసుకువచ్చే విషయమై విద్యార్థులు, తల్లిదండ్రులు, విద్యావేత్తల సలహాలను మాత్రమే కోరడం జరిగింది. ప్రజలు తమ సూచనలను జనవరి 26, 2025 లోపు biereforms@gmail.com కు మెయిల్ చేయాలి. ప్రతిపాదిత సంస్కరణల విధానాలు bieap.gov.in అనే వెబ్ సైట్ లో అందుబాటులో ఉంచారు. కాబట్టి ప్రజలెవరూ ఇలాంటి వదంతులను నమ్మొద్దు.’ అని ఫాక్ట్ చెక్ విభాగం పేర్కొంది.