No GST on UPI transactions over Rs 2,000 | యూపీఐ లావాదేవీలపై కేంద్రం జిఎస్టీ విధించనుందని జాతీయ మీడియాలో కథనాలు వెలువడ్డాయి. దింతో యూపీఐ వినియోగదారులు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.
యూపీఐ ద్వారా రూ.రెండు వేలు, అంతకు మించి పేమెంట్స్ చేస్తే కేంద్రం 18% జిఎస్టీ విధించనుందని ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంలో ఎలాంటి వాస్తవం లేదని కేంద్ర ఆర్థిక మంత్రిత్వశాఖ స్పష్టం చేసింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఒక అధికారిక ప్రకటన విడుదల చేసింది.
యూపీఐ భారతదేశంలో డిజిటల్ పేమెంట్ల విప్లవానికి దోహదపడిందని ప్రస్తుతం యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధించే ఎలాంటి ప్రణాళిక లేదంది. ప్రచారంలో ఉన్న వార్తలు నిరాధార, తప్పుదోవ పట్టించేవని పేర్కొంది.
యూపీఐ లావాదేవీలపై జీఎస్టీ విధిస్తే చిన్న వ్యాపారులు, మధ్యతరగతి కుటుంబాలపై తీవ్ర ప్రభావం పడుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇది డిజిటల్ పేమెంట్ల విస్తరణకు అడ్డంకి కావచ్చని తెలిపారు. ప్రస్తుతం యూపీఐ లావాదేవీలు ఎటువంటి జిఎస్టీ లేకుండా ఉచితంగా జరుగుతున్నాయి. మార్చి 2025లో యూపీఐ ద్వారా రూ. 24.77 లక్షల కోట్ల లావాదేవీలు జరిగాయి.