Nitish Kumar Reddy reaffirms commitment towards SRH | టీం ఇండియా స్టార్ ఆల్ రౌండర్, తెలుగు కుర్రాడు నితీష్ కుమార్ రెడ్డి ఐపీఎల్ లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ తరఫున ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం తెల్సిందే.
కానీ నితీశ్ హైదరాబాద్ జట్టును వీడుతున్నట్లు గత కొన్నిరోజులుగా ప్రచారం జరుగుతోంది. ఐపీఎల్-2025 సీజన్లో తనను లోయర్ ఆర్డర్ లో పంపడం పై నితీశ్ అసంతృప్తిగా ఉన్నాడని, ఈ క్రమంలో జట్టును వీడుతారని కథనాలు వెలువడ్డాయి.
ఈ నేపథ్యంలో జరుగుతున్న ప్రచారంపై స్టార్ ఆల్ రౌండర్ స్పందించారు. ‘ఇలాంటి ప్రచారాలకు నేను దూరంగా ఉంటా. కానీ కొన్ని విషయాల్లో స్పష్టత అవసరం. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో నా బంధం నమ్మకం, గౌరవం అనే వాటితో కొన్నేళ్లుగా కొనసాగుతోంది. నేనెప్పుడూ జట్టుతోనే ఉంటా’అని నితీష్ కుమార్ రెడ్డి ట్వీట్ చేశారు.
దింతో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని తేలిపోయింది. ఇకపోతే ఐపీఎల్ మెగా ఆక్షన్ లో భారీ ధర పలికే అవకాశం ఉన్నా నితీశ్ మాత్రం తనకు తొలి అవకాశం ఇచ్చి, తనపై నమ్మకం ఉంచిన సన్ రైజర్స్ హైదరాబాద్ తోనే ఉండాలని నిర్ణయించుకున్నారు. ఇందుకోసం రూ.6 కోట్ల రిటెన్షన్ కు ఒప్పుకున్నారు.









