Wednesday 14th May 2025
12:07:03 PM
Home > క్రీడలు > వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నీరజ్ చోప్రా..పెళ్లికూతురు ఎవరంటే !

వివాహ బంధంలోకి అడుగుపెట్టిన నీరజ్ చోప్రా..పెళ్లికూతురు ఎవరంటే !

Neeraj Chopra-Himani Wedding Ceremony | భారత జావెలిన్ త్రోయర్ ( Javelin Thrower ) నీరజ్ చోప్రా వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. హరియాణ సోనిపత్ ( Sonipat ) కు చెందిన హిమాని ( Himani )తో ఆయన వివాహం జరిగింది.

ఈ విషయాన్ని నీరజ్ చోప్రా సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్స్ తో పంచుకున్నారు. జీవితంలో నూతన అధ్యాయాన్ని ప్రారంభిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో ప్రముఖులు నూతన జంటకు శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

కాగా పాతికేళ్ల హిమాని టెన్నిస్ ప్లేయర్. ప్రస్తుతం ఆమె అమెరికా న్యూ హ్యాంప్షైర్ ( New Hampshire ) లో స్పోర్ట్స్ మేనేజ్మెంట్ లో మాస్టర్స్ చేస్తున్నారు. ఆమె సోదరుడు హిమాన్షు కూడా టెన్నిస్ ప్లేయర్. ఇదిలా ఉండగా నీరజ్-హిమాని వివాహ వేడుక హిమాచల్ లో జరిగింది.

అత్యంత సన్నిహితుల సమక్షంలో వేదమంత్రాలతో ఈ జంట ఒక్కటయ్యింది. కాగా టోక్యో ఒలింపిక్స్ లో స్వర్ణం సాధించి చరిత్ర సృష్టించిన 27 ఏళ్ల నీరజ్ గతేడాది జరిగిన ప్యారిస్ ఒలింపిక్స్ లో రజతం గెలిచారు.

You may also like
“Operation Keller”..సైన్యం సంచలన ప్రకటన
‘భారత బలం-సంయమనం రెండింటినీ చూశాం’
ఆదంపూర్ ఎయిర్ బేస్ లో ప్రధాని
మృణాల్ ఠాకూర్ తో పెళ్లి..స్పందించిన నటుడు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions