Nara Lokesh News Latest | సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉండే మంత్రి లోకేశ్ తాజగా ఓ ఆసక్తికరమైన పోస్టును షేర్ చేశారు.
కృష్ణా జిల్లా వ్యాప్తంగా డ్రోన్ల సహాయంతో బహిరంగ ప్రదేశాల్లో అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడుతున్న వారిని పోలీసులు వేటాడుతున్నారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం వైరల్ గా మారుతున్నాయి. గుడివాడ పరిధిలో ఇంజనీరింగ్ కాలేజి వెనుకాల బహిరంగ ప్రదేశాలలో మద్యం సేవిస్తున్న ఇద్దర్ని డ్రోన్ సహాయంతో పోలీసులు గుర్తించారు.
మద్యం సేవిస్తున్న ఇద్దరిని అదుపులోనికి తీసుకొని, వారిపై కేసు నమోదు చేయడం జరిగిందని పోలీసులు వెల్లడించారు. అయితే మధ్య సేవిస్తున్న వారిని డ్రోన్ వెంటాడడం వైరల్ గా మారింది.
డ్రోన్ ను చూసిన మద్యం సేవిస్తున్న వారు అక్కడి నుండి పరుగందుకున్నారు. సదరు వీడియోపై మంత్రి లోకేశ్ సరదాగా స్పందించారు.
‘పొలాల మధ్యలో పరిగెడుతున్న వారిని చూస్తుంటే జాలి కలుగుతుంది. సారి గయ్స్, నేను ఎలాంటి సహాయం చేయలేకపోతున్నా. ఎందుకంటే పోలీసు డ్రోన్లు వాటి విధులు నిర్వహిస్తున్నాయి’ అని లోకేశ్ పోస్ట్ చేశారు.