Saturday 28th March 2026
12:07:03 PM
Home > తాజా > ఆడపిల్ల పుడితే రూ.10 వేలు.. పెళ్లికి రూ. 25 వేలు!

ఆడపిల్ల పుడితే రూ.10 వేలు.. పెళ్లికి రూ. 25 వేలు!

Election commission
  • మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో బాండ్ పేపర్ రాసిచ్చిన అభ్యర్థి!

Municipal Elections Campaign | ఇటీవల కాలంలో ఎన్నికల ప్రచారంలో బాండ్ పేపర్ల (Bond Papers)పై హమీలు సంప్రదాయంగా మారాయి. అభ్యర్థులు తాము గెలిస్తే ఏయే పనులు చేస్తామో వివరిస్తూ ఒక బాండ్ పేపర్ మీద రాసి ప్రచారం చేస్తున్నారు.

గత సార్వత్రిక ఎన్నికల్లో ఈ ట్రెండ్ బాగా కనిపించింది. తాజాగా తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో బాండ్ పేపర్ ప్రచారం జోరందుకుంది. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ (Sultanabad) మున్సిపల్ పోరులో నిలిచిన ఓ అభ్యర్థి తనను గెలిపిస్తే సొంత డబ్బుతో సంక్షేమ కార్యక్రమాలు చేపడతానని హామీ ఇచ్చారు.

ఈ మేరకు తన హామీలను బాండ్ పేపర్ పై రాసిచ్చారు. ఆ బాండ్ పేపర్ తో ఇంటింటికీ తిరుగుతూ తనకు ఓటేసి గెలిపించాలని ప్రజలను విజ్ఞప్తి చేస్తున్నారు. సుల్తానాబాద్ మున్సిపాలిటీ 9వ వార్డు నుంచి ఆల్ ఇండియా ఫ్వార్వార్డ్ బ్లాక్ పార్టీ తరఫున గొట్టం మహేశ్ పోటీ చేస్తున్నారు.

తనను గెలిపిస్తే తన వార్డు పరిధిలో ఉండే అమ్మాయిల వివాహాలకు రూ.25,016, ఆడపిల్ల పుడితే రూ.10,016, మగ పిల్లాడు పుడితే రూ.5,016 అందిస్తానని హామీ ఇచ్చారు. ఈ హామీలను ఒక బాండ్ పేపర్ మీద రాసి ఇంటింటా తిరుగుతూ ప్రచారం చేస్తున్నారు. ఈ హామీలను అమలు చేయలేకపోతే కౌన్సిలర్ పదవికి రాజీనామా చేస్తానని కూడా బాండ్ పేపర్ లో పేర్కొన్నారు.

You may also like
నిజాయతీలో మా పిల్లలు బంగారం.. విద్యార్థినులపై మంత్రి లోకేశ్ ప్రశంసలు!
ssc hall tickes on whatsapp
WhatsApp ద్వారా SSC హాల్ టికెట్స్.. డౌన్ లోడ్ చేసుకోండిలా!
జగన్ పై టీటీడీ ఛైర్మన్ సంచలన వ్యాఖ్యలు!
Iran warship hit by USA
WW-II తర్వాత అతిపెద్ద దాడి.. విశాఖ నుంచి వెళ్తున్న ఇరాన్ నౌకపై..

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions