Tuesday 3rd March 2026
12:07:03 PM
Home > క్రీడలు > స్టేడియంలో ఎంఎస్ ధోని తల్లిదండ్రులు..అందుకోసమేనా!

స్టేడియంలో ఎంఎస్ ధోని తల్లిదండ్రులు..అందుకోసమేనా!

MS Dhoni’s parents attend Chennai Super Kings match against Delhi Capitals | ఐపీఎల్ లో భాగంగా శనివారం సాయంత్రం చెన్నై వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్ తో చెన్నై సూపర్ కింగ్స్ తలపడింది.

ఈ మ్యాచ్ సందర్భంగా ఓ ఆసక్తికరమైన సన్నివేశం కనిపించింది. సీఎస్కే మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని తల్లిదండ్రులు స్టేడియంలో కనిపించారు. ఎప్పుడూ పెద్దగా స్టేడియానికి రాని వీరు ఇప్పుడు స్టేడియంలో కనిపించడం మాత్రం ఆసక్తిగా మారింది.

ధోని మ్యాచ్ ఆడే సమయంలో ఆయన సతీమణి సాక్షి తరచుగా స్టేడియంలో కనిపిస్తుంటారు. కానీ ధోని తల్లిదండ్రులు పాన్ సింగ్, దేవకీదేవి మ్యాచులు చూసేందుకు రారు. కానీ శనివారం జరిగిన మ్యాచుకు వచ్చిన ధోని తల్లిదండ్రులు సీఎస్కే-డీసీ మధ్య జరిగిన మ్యాచ్ ను వీక్షించారు. ఈ నేపథ్యంలో ధోని రిటైర్మెంట్ అంటూ సోషల్ మీడియాలో మరోసారి ప్రచారం మొదలయ్యింది.

చివరిసారిగా 2023లో సీఎస్కే కు కెప్టెన్ గా వ్యవహరించిన ధోని ఆ సీజన్ లో చెన్నై ను విజేతగా నిలిపారు. అనంతరం రుతురాజ్ కు కెప్టెన్సీ బాధ్యతలు అప్పగించారు. ఇదిలా ఉండగా రిటైర్మెంట్ పై జరుగుతున్న ప్రచారంపై ఇటీవలే ధోని స్పందించారు.

చెన్నై తరఫున మరికొన్ని రోజులు ఆడాలని ఉందని, సీఎస్కే తన ఫ్రాంచైజీ అని పేర్కొన్నారు. ఒకవేళ తాను వీల్ ఛైర్ లో ఉన్నా లాక్కోస్తారని ధోని చేసిన కామెంట్స్ గతంలో వైరల్ గా మారిన విషయం తెల్సిందే.

You may also like
వెలుగుమట్ల నిర్వాసితులకు పట్టాలు: మంత్రి
kalvakuntla kavitha
‘ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి’
రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం
‘బీఆర్ నాయుడు కాదు..బీఆర్ కామ నాయుడు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions