Saturday 4th April 2026
12:07:03 PM
Home > క్రీడలు > IND vs PAK..తోకముడిచిన నఖ్వీ

IND vs PAK..తోకముడిచిన నఖ్వీ

Mohsin Naqvi embarrassed | టీ-20 వరల్డ్ కప్ లో దాయాధి పాకిస్థాన్ పై భారత్ తిరుగులేని ఆధిక్యాన్ని కొనసాగించింది. ఎన్నో ట్విస్టులు, మరెన్నో వివాదాల అనంతరం భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ ఖరారు అయ్యింది. ఆదివారం శ్రీలంకలోని కొలంబో వేదికగా జరిగిన లీగ్ మ్యాచులో చిరకాల ప్రత్యర్థిని చిత్తుచేసి అభిమానులను అలరించింది భారత్. అయితే ఓటమిని ముందే గ్రహించిన పాకిస్థాన్ క్రికెట్ బోర్డు చీఫ్ మోసిన్ నఖ్వీ స్టేడియం నుండి వెళ్ళిపోయాడు. భారత్ తో మ్యాచును బాయకాట్ చేయడంలో ఇతడే కీలకం. అయితే ఐసీసీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఎట్టకేలకు టీం ఇండియాతో మ్యాచుకు పాక్ అంగీకరించింది. ఈ మ్యాచులో భారత్ ను ఒడిస్తే హంగామా చేయాలని నఖ్వీ భావించాడు.

కానీ అలా జరగలేదు. టాస్ ఓడినప్పటికీ, అది బ్యాటింగ్ కు అనుకూలం అయిన పిచ్ కానప్పటికీ భారత ఆటగాళ్లు చెలరేగిపోయారు. అనూహ్యంగా వరల్డ్ కప్ జట్టులో చోటు సంపాదించుకున్న పాకెట్ డైనమైట్ ఇషాన్ కిషన్ పాక్ బౌలర్లకు ముచ్చెమటలు పట్టించాడు. కేవలం 40 బంతుల్లోనే 77 పరుగులతో మాస్ బ్యాటింగ్ చేశాడు. ఈ క్రమంలో నిర్ణీత ఓవర్లలో టీం ఇండియా 175 పరుగులు చేసింది. అనంతరం లక్ష్య చేదనకు దిగిన పాక్, భారత బౌలింగ్ ధాటికి కుప్పకూలింది. దింతో 61 పరుగుల భారీ తేడాతో భారత్ విజయాన్ని ముద్దాడింది. అయితే భారత్ ప్లేయర్ల బౌలింగ్ ధాటికి పాక్ ఓటమిని ముందుగానే ఊహించిన నఖ్వీ మ్యాచ్ మధ్యలోనే స్టేడియం నుంచి వెళ్ళిపోయాడు. బాయ్కాట్ డ్రామాకు తెరలేపిన నఖ్వీ ఇలా తోకముడిచి ముందుగానే వెళ్లిపోవడంతో సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయి.

You may also like
Jupally krishna rao
తెలంగాణలో మ‌ద్యం అమ్మ‌కాల‌ను ప్రోంత్స‌హించిందెవ‌రు?
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions