Mohan Babu Files Complaint Against His Son Manchu Manoj | మంచు కుటుంబం ( Manchu Family )లో విభేదాలు రోడ్డున పడ్డాయి. కొడుకు మంచు మనోజ్ ( Manchu Manoj ), ఆయన సతీమణి మౌనిక ( Manchu Mounika )పై మోహన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
మనోజ్, మౌనిక నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదులో సంచలన ఆరోపణలు చేశారు మోహన్ బాబు. మోహన్ బాబు ఫిర్యాదు మేరకు మనోజ్, మౌనికలపై పహాడి షరీఫ్ పోలీసులు కేసును నమోదు చేశారు.
మరోవైపు మంచు మనోజ్ ఫిర్యాదు నేపథ్యంలో విజయ్ రెడ్డి, కిరణ్ తో పాటు మరికొందరిపై కేసు నమోదైంది.
తండ్రి తనపై ఫిర్యాదు చేయడం పట్ల మనోజ్ స్పందించారు. తనపై, తన భార్యపై మోహన్ బాబు చేసిన ఆరోపణల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు. ఉద్దేశ్యపూర్వకంగానే తన పరువుకు నష్టం కలిగించే విదంగా ప్రవర్తిస్తున్నారని పేర్కొన్నారు.