MLC Kavitha News Latest | ఆంధ్రప్రదేశ్ లో కలిపిన గ్రామాల్లో ఐదు గ్రామాలను తెలంగాణకు ఇవ్వాలని బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత డిమాండ్ చేశారు.
ఈ మేరకు హైదరాబాద్ లో ఆమె ‘పోలవరం, తెలంగాణపై జల ఖడ్గం’ రౌండ్ టేబుల్ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ..జూన్ 25న ప్రధాని మోదీ ‘ప్రగతి ఎజెండా’ పేరుతో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, ఒడిశా, ఛత్తీస్ ఘడ్ ముఖ్యమంత్రులతో సమావేశం నిర్వహించనున్నారని, ఇందులో పోలవరంతో పాటు అనేక విషయాలపై చర్చించనున్నారని పేర్కొన్నారు.
ఈ మీటింగ్ లో ప్రధాని ఏపీలో కలిపిన ఐదు గ్రామాలను తెలంగాణ తిరిగి ఇచ్చేందుకు నిర్ణయం తీసుకోవాలని కవిత డిమాండ్ చేశారు. పురుషోత్తపట్నం, గుండాల, ఎట్టపాక, కన్నాయగూడెం, పిచ్చుకలపాక గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బంది పడుతున్నారని, ఈ నేపథ్యంలో ఐదు గ్రామాలను వెనక్కి తీసుకొచ్చేలా సీఎం రేవంత్ రెడ్డి కేంద్రంపై ఒత్తిడి చేయాలని కవిత సూచించారు.