MLC Kavitha News Latest | తెలంగాణ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా కులగణన సర్వే ( Caste Census ) ను చేపడుతోంది. ఇందులో భాగంగా 87 వేలకు పైగా ఎన్యుమరేటర్లు ( enumerators ) 8 వేలకు పైగా సుపరువైజర్లు సర్వేను నిర్వహిస్తున్నారు.
మొత్తం 8 పేజీల్లో 56 అంశాలకు సంబంధించి 75 ప్రశ్నలు అడుగుతున్నారు. అక్కడక్కడ ఎన్యుమరేటర్లను కొందరి ప్రశ్నలు మినహా సర్వే సాఫీగా సాగుతుంది.
కులగణనలో భాగంగా అధికారులు బీఆరెస్ ఎమ్మెల్సీ కవిత ( MLC Kavitha ) ఇంటికి వెళ్లారు. శుక్రవారం హైదరాబాద్ లోని ఆమె నివాసానికి వెళ్లిన అధికారులు సర్వేను నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులకు సహకరించిన కవిత వివరాలను చెప్పారు.
మరోవైపు ఢిల్లీ మద్యం పాలసీ స్కామ్ కేసులో అరెస్ట్ అయి బెయిల్ ( Bail ) పై బయటకు వచ్చిన కవిత చాలా రోజులుగా రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు.