Wednesday 4th March 2026
12:07:03 PM
Home > తాజా > యాదగిరిగుట్టలో మిస్ యూనివర్స్

యాదగిరిగుట్టలో మిస్ యూనివర్స్

Miss Universe Victoria Kjaer Theilvig Visits Yadagirigutta | మిస్ యూనివర్స్-2024 విజేతగా నిలిచిన విక్టోరియా కెజార్ హెల్విగ్ మంగళవారం యాదగిరిగుట్ట శ్రీలక్ష్మి నరసింహస్వామిని దర్శించుకున్నారు.

చీర కట్టులో ఆలయానికి వచ్చిన ఆమెకు అధికారులు స్వాగతం పలికారు. నరసింహ స్వామికి విక్టోరియా ప్రత్యేక పూజలు నిర్వహించారు. క్షేత్రపాలకుడు ఆంజనేయస్వామిని దర్శించుకుని ముఖ మంటపంలో స్వర్ణ ధ్వజస్తంభానికి మొక్కి గర్భాలయంలోకి వెళ్లారు.

అనంతరం ఆలయ అర్చకులు వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. డెన్మార్క్ దేశస్థురాలైన విక్టోరియా కెజార్ కేవలం ఇరవై ఏళ్ళ వయస్సులోనే మిస్ యూనివర్స్ గా నిలిచారు.

మిస్ వరల్డ్ 2025 ప్రీ-ఈవెంట్ ప్రెస్ కాన్ఫరెన్స్‌లో భాగంగా హైదరాబాద్‌కు చేరుకున్నారు విక్టోరియా. ఈ సందర్భంగా యాదగిరిగుట్ట ఆలయాన్ని దర్శించుకున్నారు.

You may also like
వెలుగుమట్ల నిర్వాసితులకు పట్టాలు: మంత్రి
kalvakuntla kavitha
‘ఎస్సీల రిజర్వేషన్లు 18 శాతానికి పెంచాలి’
రాష్ట్రంలో కాంగ్రెస్ బుల్డోజర్ రాజ్యం
‘బీఆర్ నాయుడు కాదు..బీఆర్ కామ నాయుడు’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions