Friday 13th March 2026
12:07:03 PM
Home > తాజా > ‘పెట్టుబడులకు గ్లోబల్ హబ్‌గా హైదరాబాద్’

‘పెట్టుబడులకు గ్లోబల్ హబ్‌గా హైదరాబాద్’

hyderabad global hub

‌- 2047 నాటికి 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థే లక్ష్యం: మంత్రి శ్రీధర్ బాబు

Hyderabad As Global Hub | ఆవిష్కరణలు మరియు పెట్టుబడులకు హైదరాబాద్ నగరం గ్లోబల్ హబ్‌గా మారుతోందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ (Minister Sridhar Babu) బాబు వెల్లడించారు.

జర్మనీకి చెందిన ‘గ్లోబల్ బ్రిడ్జెస్’ (Global Bridges) స్వచ్ఛంద సంస్థ ప్రతినిధి బృందం శుక్రవారం సచివాలయంలో మంత్రితో భేటీ అయ్యింది. ఈ సందర్భంగా తెలంగాణలో ఉన్న పారిశ్రామిక అవకాశాలు, ప్రభుత్వ ప్రోత్సాహకాలపై ఆయన వారితో సుదీర్ఘంగా చర్చించారు.

ఫ్యూచర్ సిటీతో మారునున్న రూపురేఖలు

హైదరాబాద్ దక్షిణ భాగంలో నిర్మిస్తున్న ‘ఫ్యూచర్ సిటీ’ రాష్ట్ర భవిష్యత్తుకు బలమైన పునాది అని మంత్రి పేర్కొన్నారు.

ఇందులో భాగంగా ఏర్పాటవుతున్న ఏఐ సిటీ (AI City), నెట్ జీరో సిటీ, మరియు యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ ప్రాజెక్టుల ద్వారా ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను కల్పిస్తున్నామని చెప్పారు.

తెలంగాణ పారిశ్రామిక విధానం – ముఖ్యాంశాలు:

  • స్థిరమైన విధానాలు: ప్రభుత్వాల మార్పుతో సంబంధం లేకుండా మెరుగైన పారిశ్రామిక విధానాలను కొనసాగిస్తూ పరిశ్రమలకు భరోసా కల్పిస్తున్నామని మంత్రి తెలిపారు.
  • సెమీ కండక్టర్ రంగం: చిప్స్ డిజైన్, తయారీ రంగాల్లో తైవాన్, కొరియా సంస్థలు ఇప్పటికే తెలంగాణలో కార్యకలాపాలు ప్రారంభించాయని వివరించారు.
  • స్కిల్లింగ్ & రీ-స్కిల్లింగ్: యువతను ప్రపంచ స్థాయి సవాళ్లకు సిద్ధం చేయడానికి స్కిల్లింగ్ కార్యక్రమాల ద్వారా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందిస్తున్నట్లు చెప్పారు.
  • లక్ష్యం: 2047 నాటికి తెలంగాణను 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని స్పష్టం చేశారు.

హైదరాబాద్‌లోని కాస్మోపాలిటన్ జీవనశైలి, నిరంతర విద్యుత్ సరఫరా, మరియు పుష్కలమైన మానవ వనరులు అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయని శ్రీధర్ బాబు ఈ సందర్భంగా జర్మన్ బృందానికి వివరించారు.

ఈ సమావేశంలో జర్మన్ ప్రతినిధులు డా. స్టెఫాన్ ట్రేగర్, పరిశ్రమల శాఖ డైరెక్టర్ నిఖిల్ చక్రవర్తి తదితరులు పాల్గొన్నారు.

You may also like
sridhar babu
గ్లోబల్ వాల్యూ క్రియేషన్ హబ్ గా హైదరాబాద్‌: మంత్రి శ్రీధర్ బాబు
‘తెలంగాణలో జపాన్ వ్యాపార దిగ్గజం భారీ పెట్టుబడులు’
ktr
సపోర్టింగ్ రోల్ లో మంత్రి శ్రీధర్ బాబుకు భాస్కర్ అవార్డు

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions