Minister Seethakka Counter To Bandi Sanjay | రేవంత్ క్యాబినెట్ ( Revanth Cabinet ) లో అర్బన్ నక్సలైట్లు ఉన్నారంటూ కేంద్ర సహాయమంత్రి, బీజేపీ నాయకులు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.
బండి సంజయ్ చేసిన వ్యాఖ్యలను తీవ్రంగా తప్పుబట్టారు మంత్రి సీతక్క. మంత్రివర్గంలో మావోయిస్టు గత నేపథ్యం ఉన్న వ్యక్తిని తాను ఒక్కదాన్నేనని, దీన్ని సాకుగా చేసుకుకొని మొత్తం మంత్రివర్గాన్ని లక్ష్యం చేసుకోవడం సరికాదన్నారు.
తాను మంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన మరుసటి రోజు నుండి ఏ, బీ టీంలు అయిన బీజేపీ, బీఆరెస్ తనపై దుష్ప్రచారం మొదలుపెట్టాయని మండిపడ్డారు. గతంలో తనను బండి సంజయ్ కలిసిన సమయంలో వీరవనిత అని పొగిడినట్లు గుర్తుచేశారు.
నక్సలిజాన్ని వదిలేసి జనజీవన స్రవంతిలో కలవాలని ప్రధాని మోదీ ( Pm Modi ), అమిత్ షా ( Amit Shah ) పిలుపునిస్తుంటే బండి సంజయ్ మాత్రం పూర్తి విరుద్ధంగా మాట్లాడుతున్నారని మండిపడ్డారు. టీడీపీ తరఫున ములుగు నుండి పోటీ చేసిన సమయంలో రెండు సార్లు బీజేపీ కూడా తనకు మద్దతు ఇచ్చినట్లు, మరి అప్పుడు నేను నక్సలైట్ అని గుర్తుకురాలేదా అని మంత్రి సీతక్క ప్రశ్నించారు.
బీజేపీలో ఉన్న ఈటల రాజేందర్ ( Eatala Rajender ), మొన్నటివరకు పార్టీలో ఉన్న బొడిగే శోభది ఏ భావజాలం అని సీతక్క ప్రశ్నించారు. వెస్ట్ బెంగాల్ లో మాజీ మావోయిస్టులకు బీజేపీ టికెట్లు ఇవ్వలేదా అని నిలదీశారు.