Mallareddy Satires On Revanth | రైతులకు ఉచిత విద్యుత్ పై తెలంగాణ పీసీసీ ప్రెసిడెంట్ రేవంత్ రెడ్డి అమెరికా పర్యటనలో చేసిన కామెంట్లపై దుమారం రేగుతోంది.
రేవంత్ చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీని ఇరకాటంలోకి నెట్టాయి.
అధికార పక్షం తోపాటు సొంత పార్టీ నేతలు కూడా రేవంత్ వ్యాఖ్యలను బహిరంగంగా తప్పుబడుతున్నారు. బీఆరెస్ పార్టీ రెండు రోజులూ రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టింది.
గ్రామాల నుంచి మండల కేంద్రాల వరకు కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా బీఆరెస్ శ్రేణులు ధర్నాలు నిర్వహించాయి.
తాజగా రాష్ట్ర కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి కూడా రేవంత్ రెడ్డిపై సెటైర్లు వేశారు.
మేడ్చల్ పట్టణంలోని అంబెడ్కర్ చౌరస్తా వద్ద మల్లారెడ్డి నిరసనలో పాల్గొన్నారు. అనంతరం రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మని దహనం చేశారు.
ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ టీ-పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.
Mallareddy Satires On Revanth “రేవంత్ తెలుగుదేశం పార్టీలోకి వెళ్లి ఆ పార్టీని సర్వనాశం చేశాడు.
అలాగే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉండి ఈ పార్టీని కూడా సర్వనాశనం చేస్తాడు” అని మల్లారెడ్డి తీవ్ర స్థాయిలో విమర్శలతో రెచ్చిపోయారు.
Read also: Megastar చిరంజీవి సినిమాకు నో చెప్పిన టాలీవుడ్ యంగ్ హీరో?
అమెరికాలో కూర్చొని రైతులకు 3 గంటల విద్యుత్ సరిపోతుందని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను తప్పుబట్టారు.
అమెరికాలోని ఎన్నారైల వద్ద డబ్బులు వసూలు చెయ్యడానికే రేవంత్ అమెరికాకు వెళ్లాడని మల్లారెడ్డి ఆరోపించారు.
రేవంత్ రెడ్డి ఒక బ్లాక్ మెయిలర్, గతంలో నన్ను కూడా బెదిరించాడని , రైతుల గురుంచి మాట్లాడే హక్కు రేవంత్ కు లేదు, ఆయన రైతు బిడ్డ కాదని మల్లారెడ్డి విమర్శలు గుప్పించారు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు తొమ్మిదేండ్ల నుండి కళ్ళల్లో ఒత్తులు వేసుకొని రైతుల కోసం కాళేశ్వరం వంటి ప్రాజెక్టులు కట్టి సాగునీరు, తాగునీరు అందిస్తున్నారని మల్లారెడ్డి తెలిపారు.
కేసీఆర్ 24గంటలు విద్యుత్, సాగు నీరు ఇవ్వడం వలన దేశంలోనే ఎక్కడ లేని విదంగా తెలంగాణలో 3 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని మల్లారెడ్డి తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రైతులకు 24 గంటల కరెంట్, సాగునీరు, ఉచిత ఎరువులు సరఫరా చేయలేదని విమర్శించారు.
130 ఏళ్ల చరిత్ర కలిగిన కాంగ్రెస్ పార్టీ ఒక దొంగకు పీసీసీ పదవి ఇచ్చిందని మల్లారెడ్డి ఎద్దేవా చేశారు.
తెలంగాణ రైతులకు వ్యతిరేకంగా ఎవరైనా మాట్లాడితే నాలుక చిరేస్తామని మల్లారెడ్డి హెచ్చరించారు. రైతులకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు రేవంత్ రెడ్డి వెంటనే తన పదవికి రాజీనామా చెయ్యాలని డిమాండ్ చేశారు.