Cyclone Migjam| హైదరాబాద్, డిసెంబర్ 5 : బంగాళా ఖాతం ( Bay Of Bengal ) లో ఏర్పడిన తీవ్ర తూఫాన్ ప్రభావంతో ఉత్తర, దక్షణ తెలంగాణా ( Telangana ) జిల్లాలో ఒక మోస్తరు నుండి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఆయా జిల్లాల కలెక్టర్లతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ( Shanthi Kumari ) టెలీ కాన్ఫరెన్స్ ( Tele Conference )నిర్వహించారు.
ఈ టెలికాన్ఫరెన్స్ లో విపత్తుల నిర్వహణ శాఖ కార్యదర్శి రాహుల్ బొజ్జా ( Rahul Bojja ) తోపాటు భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం ( Khammam ), ములుగు, హన్మకొండ, వరంగల్ ( Warangal ), జనగాం, మహబూబబాద్, సూర్యాపేట ( Suryapeta ) తదితర జిల్లాల కలెక్టర్లు పాల్గొన్నారు.
ఈ సందర్బంగా సి.ఎస్. ( C.S. ) శాంతి కుమారి మాట్లాడుతూ, నేడు, రేపు రెండురోజులు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్లను ఆదేశించారు.
భారీ వర్షాలు, వరదలు వచ్చిన సందర్భంలో పాటించాల్సిన ప్రొటొకాల్స్ ( Protocal ) కు అనుగుణంగా తగు చర్యలు చేపట్టాలని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం( Bhadradri Kotthagudem ), ములుగు ( Mulugu ) జిల్లాలకు ఒక్కొక్క ఎన్డీఆర్ఎఫ్ ( NDRF ) బృందాలను పంపిస్తున్నామని పేర్కొన్నారు.
Read More: రేవంత్ పేరును సూచించిన రాహుల్ గాంధీ., ఖర్గే నివాసంలో ముగిసిన భేటీ
ఇప్పటికే పూర్తిగా నిండిన చెరువులకు గండ్లు పడకుండా తగు ముందు జాగ్రత చర్యలు చేపట్టాలని ఆదేశించారు.
నీటిపారుదల శాఖ, విపత్తుల నిర్వహణ శాఖ, రోడ్లు భవనాలు, పంచాయితీ రాజ్, రెవెన్యూ శాఖ లు అప్రమత్తంగా ఉండాలని, ప్రధానంగా వరదలు వచ్చే అవకాశం ఉన్నందున కాజ్-వె, లోతట్టు ప్రాంతాల వద్ద తగు జాగ్రత చర్యలు చేపట్టాలని అన్నారు.
అవసరమైతే ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు వీలుగా పునరావాస కేంద్రాలను ముందుగానే గుర్తించాలని సి.ఎస్ శాంతి కుమారి సూచించారు.









