MI Bowler Satyanarayana Raju News | రాజులం బాబు రాజులం..ఈస్టు వెస్టు రాజులం నిన్నూ, తిలక్ వర్మ కోసం మ్యాచ్ చూడడానికి వచ్చాము అంటూ జరిగే సంభాషణకు సంబంధించిన వీడియో ఒకటి వైరల్ గా మారింది. ఆ వీడియోలో ఎంఐ బౌలర్ సత్యనారాయణ రాజు ఉన్నారు.
అతన్ని చూసేందుకు ఏపీ నుండి అభిమానులు స్టేడియానికి వెళ్లారు. ఆంధ్రప్రదేశ్ కు చెందిన యువ బౌలర్ పెనుమత్స సత్యనారాయణ రాజుని గతేడాది జరిగిన మెగా ఆక్షన్ లో ముంబై ఇండియన్స్ రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ క్రమంలో సత్యనారాయణ రాజు ఆటను చూసేందుకు కొందరు స్టేడియానికి వెళ్లారు.
మెట్లపై నుండి నడుచుకుంటూ వెళ్తున్న బౌలర్ ను కొందరు పిలవసాగారు. ‘ బాబు మేము రాజులం..ఈస్ట్ గోదావరి, వెస్ట్ గోదావరి జిల్లాకు చెందిన రాజులం. నీ కోసం, తిలక్ వర్మ కోసం బోలెడన్ని డబ్బులు పెట్టి వచ్చాం. మనిషికి రూ.12 వేలు. ఈ స్టేడియం మనమే కట్టాం, వైజాగ్ ఎంఎస్కె ప్రసాద్ మన ఫ్రెండే’ అంటూ ఒకతను సత్యనారాయణ రాజుతో చెప్పారు.
అనంతరం వారి కుటుంబం బౌలర్ తో ఫోటో దిగేందుకు ఆసక్తి కనబరచగా, సత్యనారాయణ రాజు అంగీకరించారు. ఇదిలా ఉండగా దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. కులపిచ్చిని ఐపీఎల్ లోకి కూడా తీసుకెళ్లారా అంటూ కొందరు కామెంట్లు పెడుతున్నారు.
ఏపీలోని కాకినాడకు చెందిన సత్యనారాయణ రాజు ‘ఆంధ్రా ప్రీమియర్ లీగ్’ లో భాగంగా ఏడు మ్యాచులు ఆడి ఎనమిది వికెట్లు తీసి ముంబయి సెలక్టర్ల దృస్టిలో పడ్డారు. ఐపీఎల్-2025 లో భాగంగా ముంబయి తరఫున సత్యనారాయణ రాజు రెండు మ్యాచులు ఆడి ఒక వికెట్ తీశాడు.