Megastar Chiranjeevi’s special wishes for Naga Babu | తమ్ముడు నాగబాబు కు మెగాస్టార్ చిరంజీవి అభినందనలు తెలియజేశారు.
ఇటీవల ఆంధ్రప్రదేశ్ లో జరిగిన ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో జనసేన తరఫున నాగబాబు బరిలోకి దిగారు. అనంతరం ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ నేపథ్యంలో మెగాస్టార్ చిరంజీవి స్పందించారు.
‘ఎమ్మెల్సీ గా ఎన్నికయి ఆంధ్రప్రదేశ్ శాసనమండలి లో తొలి సారి అడుగు పెట్టబోతున్న నా తమ్ముడు నాగేంద్రబాబుకి నా అభినందనలు,ఆశీస్సులు! ప్రజా సమస్యల మీద గళం విప్పుతూ, వారి అభివృద్ధికి ఎల్లప్పుడూ పాటుపడేలా నువ్వు చేసే కృషిలో ఎప్పుడూ విజయం సాధించాలని, వారి అభిమానాన్ని మరింతగా చూరగొనాలని ఆశిస్తూ నీకు నా శుభాకాంక్షలు’ అంటూ చిరు పేర్కొన్నారు.