Wednesday 18th June 2025
12:07:03 PM
Home > ఆంధ్రప్రదేశ్ > మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల గొడవ..మంచు మనోజ్ సంచలన ట్వీట్

మోహన్ బాబు యూనివర్సిటీలో ఫీజుల గొడవ..మంచు మనోజ్ సంచలన ట్వీట్

Manchu Manoj On MBUniversity Fee Issue | తెలుగు సినిమా పరిశ్రమలో మంచు మోహన్ బాబు ( Manchu Mohan Babau )అంటే క్రమశిక్షణకు మారు పేరు.

అయితే ఆయన స్థాపించిన ఎంబీయూనివర్సిటీ ( MB University )లో నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తున్నారంటూ విద్యార్థులు మరియు తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. ఈ మేరకు ఏఐఎస్ఎఫ్ ( AISF ) కు లేఖను సైతం రాశారు.

ఈ పరిణామాల నేపథ్యంలో మంచు మనోజ్ ( Manchu Manoj ) కీలక వ్యాఖ్యలు చేశారు. తన తండ్రి మోహన్ బాబు మంచి మనిషే అని చెప్పిన మనోజ్ విద్యార్థులు ఆందోళన పట్ల ఆవేదన వ్యక్తం చేశారు.

విద్యార్థుల, రాయలసీమ ప్రయోజనాలకే మోహన్ బాబు ప్రాధాన్యత ఇస్తారని చెప్పారు. మరోవైపు విద్యార్థుల, తల్లిదండ్రులు మరియు ఏఐఎస్ఎఫ్ కు పూర్తి మద్దతు ప్రకటించారు.

ఫీజుల విషయాన్ని ఛాన్సలర్ మోహన్ బాబు దృష్టికి తీసుకెళ్లనున్నట్లు పేర్కొన్నారు. అలాగే ఈ అంశంపై వర్సిటీ ఎక్జిక్యూటివ్ డైరెక్టర్ వినయ్ ని వివరణ కోరుతానని మనోజ్ చెప్పారు.

అంతేకాకుండా విద్యార్థులు తమ సమస్యను నేరుగా తనకే చెప్పేందుకు మెయిల్ ఐడీ ( Mail Id )ని కూడా ఇచ్చారు.

You may also like
manchu vishnu
ఫ్యాన్స్ కి సారీ చెబుతూ మంచు విష్ణు పోస్ట్..!
లవ్ యూ నాన్న..మంచు మనోజ్ పోస్ట్
‘సింహం అవ్వాలని ప్రతి కుక్కకి ఉంటుంది’
manchu nirmala devi
మంచు ఫ్యామిలీ ఇష్యూ.. మనోజ్ తల్లి సంచలన లేఖ!

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions