Manchu Manoj About ‘Kannappa’ Movie | మంచు విష్ణు ప్రధాన పాత్రలో తెరకెక్కిన చిత్రం ‘కన్నప్ప’. భారీ తారాగణంతో రూపొందిన ఈ సినిమా జూన్ 27న విడుదల కానుంది.
ఈ నేపథ్యంలో మంచు మనోజ్ స్పందించారు. మూవీ కి ఆల్ ది బెస్ట్ చెప్పారు. నాన్న మోహన్ బాబు మరియు ఆయన టీం సంవత్సరాల పాటు ఈ సినిమా కోసం కష్టపడ్డారని పేర్కొన్నారు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావాలని కోరుకుంటున్నట్లు సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.
అలాగే అరి, వివి, అవ్రామ్ లను వెండితెరపై చూసేందుకు ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. తనికెళ్ళ భరణి జీవితకాల కల రేపు నెరవేరుతున్నందుకు చాలా సంతోషంగా ఉందన్నారు. అలాగే ప్రభాస్, మోహన్ లాల్, అక్షయ్ కుమార్ మరియు ప్రభుదేవల ఎంతో నమ్మకంతో ఈ సినిమాకు అండగా నిలిచినందుకు మంచు మనోజ్ కృతజ్ఞతలు తెలియజేశారు.
అయితే మంచు మనోజ్ చేసిన పోస్టులో ఎక్కడా మంచు విష్ణు పేరును ప్రస్తావించకపోవడం ఆసక్తిగా మారింది. గత కొంతకాలంగా మంచు మనోజ్, విష్ణు మధ్య కుటుంబ విభేదాలు తలెత్తిన విషయం తెల్సిందే. పలు సందర్భాల్లో ఈ వివాదాలు రోడ్డెక్కాయి కూడా.