Saturday 31st January 2026
12:07:03 PM
Home > తాజా > కృష్ణా ప్రవాహంలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడారు..వీడియో వైరల్

కృష్ణా ప్రవాహంలో కొట్టుకుపోతున్న వ్యక్తిని కాపాడారు..వీడియో వైరల్

Man saved after being swept away in Krishna River in Nagarkurnool | కృష్ణా నది ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఓ వ్యక్తిని స్థానికులు కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.

హైదరాబాద్ నుంచి నలుగురు మిత్రులు నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం పాతాళ గంగ వద్దకు విహారయాత్రకు వెళ్లారు. ఈ క్రమంలో ఓ వ్యక్తి స్నానం చేసేందుకు కృష్ణా నదిలోకి దిగాడు. నదీ ప్రవాహం అధికంగా ఉండడంతో అతడు కొట్టుకుపోసాగడు.

దింతో కాపాడాలంటూ స్నేహితులు మరియు ఇతరులు కేకలు వేశారు. అక్కడే ఉన్న స్థానికులు పడవ సహాయంతో కొట్టుకుపోతున్న వ్యక్తిని రక్షించారు. తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. పడవలో సందర్శకులను తీసుకువెళ్లే లక్ష్మయ్య, గోపాల్ అనే ఇద్దరు ఇలా ధైర్యసాహసం ప్రదర్శించారు. ఈ నేపథ్యంలో ఆ ఇద్దర్ని అక్కడివారు అభినందించారు.

You may also like
కోఠిలో కాల్పులు..ఇదీ జరిగింది!
చర్యలు తీసుకోండి..పవన్ కు బిడ్డను కోల్పోయిన మహిళ వినతి
ఈ సైకిల్ పై బాబు రయ్ రయ్!
ఎన్నికల బరిలో గల్వాన్ వీరుడు సంతోష్ బాబు తల్లి

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions