కోర్టు ఆవరణలో పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మున్సిఫ్ కోర్ట్కాంప్లెక్స్‌లో మంగళవారం మేకల పోశం అలియాస్ గ్యాస్ పోశం ఒంటి పై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్యానికి పాల్పడ్డాడు.
కోర్టు ఆవరణలో పెట్రోల్ పోసుకుని వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గోదావరిఖని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మున్సిఫ్ కోర్ట్ కాంప్లెక్స్‌లో మంగళవారం మేకల పోశం అలియాస్ గ్యాస్ పోశం ఒంటి పై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యాయత్యానికి పాల్పడ్డాడు. స్థానికులు, పోలీసుల కథనం ప్రకారం.. రాజీవ్ నగర్‌కు చెందిన పోశం, అదే కాలనికి చెందిన మహేష్‌కు గత కొంత కాలంగా పాత కక్షలు ఉన్నాయి.
ఈ క్రమంలో ఈ నెల 3 న మహేష్, పోశంకు గొడవ జరిగింది. దీంతో మహేష్ ఫిర్యాదు మేరకు వన్ టౌన్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. అయితే మంగళవారం మున్సిఫ్ కోర్టు ఆవరణలోకి వచ్చిన పోశం తన వెంట ప్లాస్టిక్ బాటిల్‌లో తెచ్చుకున్న పెట్రోల్‌ను తన ఒంటి పై పోసుకున్నాడు. నాకు న్యాయం కావాలి.
ఐ వాంట్ జస్టిస్ అంటూ నినాదాలిస్తూ జేబులో ఉన్న అగ్గిపెట్టెను తీసే ప్రయత్నం చేయగా అక్కడే విధులు నిర్వహిస్తున్న ఎన్టీపీసీ పోలీస్ స్టేషన్ కోర్ట్ కానిస్టేబుల్ పురుషోత్తం, వన్ టౌన్ కోర్ట్ కానిస్టేబుల్ అభి, కోర్ట్ హోమ్ గార్డు నాగేశ్వర్ రావు సమయస్పూర్తితో వ్యహరించి పోశంను కాపాడారు. వెంటనే అక్కడే ఉన్న న్యాయవాదులు, పోలీసులు హుటాహుటిన ప్రైవేట్ దవాఖానకు తరలించి ప్రథమ చికిత్స అనంతరం ప్రభుత్వ దవాఖానకు తరలించారు.