Man Climbs Electric Pole In Sangareddy | కాంగ్రెస్ నేత, మాజీ ఎమ్మెల్యే జగ్గారెడ్డి ( Jaggareddy ) వచ్చి తనతో మాట్లాడాలని, లేదంటే కిందకు దూకి చనిపోతానంటూ ఓ వ్యక్తి విద్యుత్ స్తంభం ఎక్కి హల్చల్ చేశాడు.
ఈ ఘటన సంగారెడ్డి పట్టణంలో చోటుచేసుకుంది. రాజంపేటకు చెందిన చంద్రమౌళి అనే వ్యక్తి సంగారెడ్డిలోని విద్యుత్ కార్యాలయం ముందు ఉన్న విద్యుత్ స్తంభం ఎక్కాడు.
జగ్గారెడ్డి వచ్చి తనతో మాట్లాడుతేనే కిందకు దిగుతానని లేదంటే పై నుండి దూకి చనిపోతా అంటూ బెదిరించాడు.
పోలీసులు మరియు స్థానిక కాంగ్రెస్ నేతలు బుజ్జగించే ప్రయత్నం చేసినా సదరు వ్యక్తి వినలేదు. ఇంతకు చంద్రమౌళికి వచ్చిన సమస్య ఏంటో, ఆయన విద్యుత్ స్తంభం ఎందుకు ఎక్కారో తెలియాల్సి ఉంది.