Mahesh Kumar Goud Reacts on Kavitha Suspension | భారత రాష్ట్ర సమితి పార్టీ నుంచి ఎమ్మెల్సీ కవితను సస్పెండ్ చేస్తూ ఆ పార్టీ అధినేత కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. ఈ చర్య తెలంగాణ రాజకీయాల్లో సంచలనంగా మారింది.
ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ స్పందించారు. కవిత సస్పెన్షన్ అనేది పూర్తిగా కేసీఆర్ కుటుంబానికి సంబంధించిన వ్యవహారం అని స్పష్టం చేశారు. ఈ వ్యవహారంలో తలదూర్చే ఉద్దేశ్యం తమకు లేదన్నారు.
కేసీఆర్ కుటుంబంలో ఆస్తులు, వాటాల్లో తగాదాలు ఉన్నాయని తాము గతంలోనే చెప్పామని, ఇదే కవిత సస్పెన్షన్ కు కారణం అయి ఉండవచ్చని అభిప్రాయం వ్యక్తం చేశారు. గతంలో కవిత కాంగ్రెస్ పార్టీలో చేరుతుందని ప్రచారం జరిగిందని కానీ ఇందులో ఎలాంటి వాస్తవం లేదన్నారు. ఇది పూర్తిగా బీఆరెస్ చేసిన తప్పుడు ప్రచారమని పేర్కొన్నారు. ప్రస్తుతం ఎవర్నీ పార్టీలో చేర్చుకునే ఉద్దేశ్యం లేదని మహేష్ కుమార్ గౌడ్ తెలిపారు.









