SSMB29 Update | మహేశ్ బాబు, రాజమౌళి (Mahesh Babu – Rajamouli) దర్శకత్వంలో రానున్న ఓ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే.
ఈ సినిమాను పాన్ వరల్డ్ సినిమాగా తెరకెక్కిస్తున్నారు. అయితే శనివారం మహేశ్ పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి ఏదైనా అపడేట్ వస్తుందేమనని ఫాన్స్ ఆశించారు.
ఈ నేపథ్యంలో అభిమానులను ఉద్దేశించి రాజమౌళి.. ssmb29 కి సంబంధించి మహేశ్ ప్రీలుక్ ఫొటోను రివీల్ చేశారు. దీని పూర్తి లుక్ ను నవంబర్లో రివీల్ చేస్తామని ప్రకటించారు. “మేం ఈ సినిమా షూటింగు కొద్దిరోజుల కిందటే ప్రారంభించాం. సినిమా అప్ డేట్ పై మీ అందరి ఆసక్తి చూసి ఎంతో ఆనందంగా ఉంది. ఇది చాలా భారీస్థాయిలో రానుంది.
కేవలం ప్రెస్ మీట్ పెట్టి లేదా కొన్ని ఇమేజ్ లు విడుదల చేయడం వల్ల స్టోరీకి పూర్తిస్థాయిలో న్యాయం చేయలేం. దీన్ని భారీఎత్తున రూపొందిస్తున్నాం. నవంబర్ 2025లో మహేశ్ లుక్ ను విడుదల చేస్తాం.
గతంలో ఎప్పుడూ చూడనివిధంగా దీన్ని రూపొందిస్తున్నాం. మీరంతా సహకరిస్తారని ఆశిస్తున్నాం” అని పేర్కొన్నారు. ఈ పోస్టుకు #GlobeTrotter అనే హ్యాష్ ట్యాగ్ ని జోడించారు.









