Tuesday 17th March 2026
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > శశికళ అప్పిల్‌ను తిరస్కరించిన మద్రాసు హైకోర్టు

శశికళ అప్పిల్‌ను తిరస్కరించిన మద్రాసు హైకోర్టు

Madras High Court rejects Sasikala's appeal

చెన్నై: తమిళనాడు దివంగత సీఎం జయలలిత స్నే హితురాలు వీకే శశికళకు.. మద్రాసు హైకోర్టులో చుక్కెదురైంది. అన్నాడీఎంకే పార్టీకి తాత్కా లిక ప్రధాన కార్యదర్శిగా తనను కొనసాగించాలని ఆమె పెట్టుకున్న అభ్యర్థనను కోర్టు తిరస్క రించింది. జస్టిస్‌ ఆర్‌ సుబ్రమణియన్‌, ఎన్‌. సెంథిల్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఇవాళ ఆ కేసులో తీర్పును ఇచ్చింది. 2022లో శశికళ దాఖలు చేసిన మూడు అప్పీల్స్‌ను బెంచ్‌ తిరస్కరించింది. మాజీ సీఎం జయలలిత మృతి తర్వాత 2016, డిసెంబర్‌ 29వ తేదీన అన్నాడీఎంకే పార్టీ జనరల్‌ సెక్రటరీగా శశికళను నియమించారు. ఆ తర్వాత జరిగిన పరి ణామాల్లో ఆమెను తొలగించారు. అయితే ఆ పోస్టులో తననే ప్రకటించాలని ఆమె పెట్టుకున్న అభ్యర్థనను కోర్టు కొట్టిపారేసింది.

You may also like
ponguleti srinivasa reddy
‘ప్రగతి పథంలో పేదల సంక్షేమం’
Kumbha mela monalisa
‘లవ్ జిహాద్’.. స్పందించిన కుంభమేళా మోనాలిసా!
jagan
ఉప ప్రధానిగా చంద్రబాబు.. జగన్ సెటైర్లు !
Minister Adluri Laxman
‘గోదావరి పుష్కరాలు ఘనంగా నిర్వహించాలి’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions