Wednesday 16th July 2025
12:07:03 PM
Home > జాతీయ – అంతర్జాతీయ > గొప్ప మనసు చాటుకున్న లులూ గ్రూప్ చైర్మన్!

గొప్ప మనసు చాటుకున్న లులూ గ్రూప్ చైర్మన్!

lulu group
  • ఇంటి రుణం తీర్చలేని మహిళకు ఆర్థిక సాయం!

LuLu Group Chairman | లూలూ గ్రూప్ చైర్మన్ ఎంఏ యూసఫ్ అలీ (MA Yusuff Ali) తన గొప్ప మనసు చాటుకున్నారు. ఉదారతను ప్రదర్శించి ఓ మహిళకు, ఆమె పిల్లలకు సాయం చేశారు. కేరళలోని ఎర్నాకులం జిల్లాలో సంధ్య, ఆమె భర్త ఉత్తర పరవూరులో 2019లో ఓ ఫైనాన్స్ కంపెనీ నుంచి రూ.4 లక్షల రుణం తీసుకున్నారు. అయితే, ఆమె భర్త 2021లో కుటుంబాన్ని విడిచిపెట్టడంతో రుణం చెల్లించడం లేదు. వడ్డీతో సహా రుణ మొత్తం దాదాపు రూ. 8 లక్షలకు పెరిగింది.

నెలకు దాదాపు రూ.9 వేల ఆదాయం వచ్చే దుకాణంలో పనిచేస్తున్న సంధ్య రెండేళ్లుగా అప్పు తీర్చే పరిస్థితి లేదు.దీంతో ఒక రోజు, ఆ ఫైనాన్స్ సంస్థ సంధ్య ఇంటిని స్వాధీనం చేసుకుని ఇంట్లోకి ప్రవేశించకుండా నిషేధించింది. ఆమె మరియు ఆమె పిల్లలు రోడ్డున పడ్డారు. ఈ వార్త లూలూ గ్రూప్ చైర్మన్ దృష్టికి రావడంతో ఆయన వెంటనే స్పందించి లోన్ మొత్తం చెల్లించాలని తన కంపెనీ ప్రతినిధులను ఆదేశించారు. అంతే కాకుండా సంధ్య కుటుంబానికి మరో 10 లక్షల రూపాయలు ఫిక్స్ డ్ డిపాజిట్ చేయించారు.

You may also like
టీకా కోసం 20 కి.మీ నడిచిన 95 ఏళ్ల వృద్ధురాలు..కారణం ఏంటంటే!
పిన్ని వరుస యువతితో ప్రేమ..గ్రామపెద్దల ‘నాగలి శిక్ష’
‘ఉల్టా పానీ’ అద్భుతం..మీరు అక్కడికి వెళ్ళండి
తోడు కోసం పెళ్లి చేసుకుంటే..భర్త కాదు మోసగాడు !

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions