Loco Pilots Saved 60 Elephants | లోకో పైలట్ అప్రమత్తం కావడంతో ఏకంగా 60 ఏనుగుల ప్రాణాలు నిలిచాయి. అస్సాంలోని హబీపూర్ లంసాఖాంగ్ ( Habaipur – Lamsakhang ) మధ్య దాదాపు 60 ఏనుగుల గుంపు దాటుతుంది.
ఇదే సమయంలో 15959 కామ్రూప్ ఎక్స్ప్రెస్ ( Kamrup Express ) అటునుండి దూసుకువస్తుంది. ఇది గమనించిన లోకో పైలట్ దాస్ మరియు అసిస్టెంట్ లోకో పైలట్ ఉమేష్ కుమార్ సడెన్ బ్రేకు ( Emergency Brakes )లు వేయడం ద్వారా పెను విషాదం తప్పింది.
ఈ ప్రాంతంలో ఏనుగుల సంచారం అధికంగా ఉంటుంది. ట్రాక్‌ను సమగ్రంగా కవర్ చేసే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ బేస్డ్ ( AI Based ) డిటెక్షన్ సిస్టమ్ ద్వారా పైలట్‌లు అప్రమత్తం అయ్యారు.
ట్రైన్ ఆగిన వెంటనే లోకో పైలట్ మరియు ప్రయాణికుల సహాయంతో ఏనుగుల గుంపును తరిమేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది.
ఇదిలా ఉండగా రైల్వే ట్రాక్ లను అటవీ జంతువులు దాటే ప్రాంతాల్లో AI-ఆధారిత నిఘా వ్యవస్థ ద్వారా థర్మల్ కెమెరాలు మరియు రియల్ టైమ్ అలర్ట్‌లతో నిరంతర పర్యవేక్షణ చేసేలా అధికారులు చర్యలు చేపడుతున్నారు.