Latest News | కొన్నిరోజుల క్రితం సికింద్రాబాద్ ఎంఎంటీఎస్ రైలులో తనపై అత్యాచారయత్నం జరిగినట్లు ఓ యువతి ఆరోపణలు చేయడం సంచలనంగా మారిన విషయం తెల్సిందే.
అయితే ఈ కేసు ఊహించని మలుపు తిరిగింది. రైలులో ప్రయాణిస్తున్న సమయంలో ఒక వ్యక్తి తనపై అత్యాచారం చేయడానికి ప్రయత్నిస్తే తాను రైలు నుండి దూకేసినట్లు సదరు యువతి వాపోయింది. కానీ రీల్స్ చేస్తున్న సమయంలో ఆమె దురదృష్టవశాత్తు రైలు నుండి కింద పడిపోయిందని తాజగా పోలీసుల విచారణలో తేలింది.
ఈ విషయాన్ని స్వయంగా యువతే పోలీసులకు వెల్లడించింది. ఆమె మాటలు విన్న పోలీసులు కంగుతున్నారు. వివరాల్లోకి వెళ్తే రైలులో అత్యాచారయత్నం కేసును రైల్వే పోలీసులు లోతైన దర్యాప్తు చేపట్టారు. 250 సీసీటీవీ కెమెరాల ఫుటేజ్ ను నిశితంగా పరిశీలించారు.
అలాగే వందకు పైగా అనుమానితులను విచారించారు. అయినప్పటికీ యువతి చెప్పిన కథనాలు పోలీసులకు అనుమానం తెప్పించాయి. ఆమె చెప్పిన కథనాలను సరైన ఆధారాలు ఎక్కడా లభించలేదు. దింతో యువతినే విచారించగా, ఆఖరికి ఆమె నిజం ఒప్పుకుంది. రీల్స్ చేస్తూ రైలు నుండి కిందపడిపోయినట్లు నిజం ఒప్పుకుంది.
కానీ రీల్స్ చేస్తూ పడిపోయానని ఎవరికైనా తెలిస్తే తిడుతారని భావించిన ఆమె అత్యాచారయత్నం అనే కట్టుకథను అల్లినట్లు పోలీసులు స్పష్టం చేశారు. ఇకపోతే ఈ కేసుకు సంబంధించి నిందితుడిగా ఆరోపిస్తూ ఒక వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకోవడం గమనార్హం.