Sunday 11th May 2025
12:07:03 PM
Home > తాజా > సంగారెడ్డి జైల్లో లగచర్ల గ్రామస్థులకు కేటీఆర్ పరామర్శ

సంగారెడ్డి జైల్లో లగచర్ల గ్రామస్థులకు కేటీఆర్ పరామర్శ

ktr comments

KTR Meets Lagacharla Incident Accused In Sangareddy Jail | బీఆరెస్ అధినేత కేసీఆర్ ఆదేశాల మేరకు పార్టీ సీనియర్ నాయకులతో కలిసి సంగారెడ్డి జైల్లో ఉన్న లగచర్ల బాధితులను కలవటం జరిగిందని బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలిపారు.

లగచర్ల లో పేదల భూమి సేకరించే విషయంలో వాళ్లను సమిధలు చేస్తున్నారని ప్రభుత్వాన్ని నిలదీశారు. రూ. లక్షలు విలువ చేసే భూములను అడ్డికి పావు శేరు ఇస్తామంటే ఎలా ఒప్పుకుంటామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని కేటీఆర్ చెప్పారు.

లగచర్ల సహా భూమి కోల్పోతున్న రైతులు తీవ్రంగా రోదిస్తున్నారని పేర్కొన్నారు. కష్టపడి సాధించుకున్న తెలంగాణలో రేవంత్ రెడ్డి రాబంధులా వచ్చి పేదల భూములను కొల్లగొడుతున్నాడని తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేశారు. గతంలో ఫార్మా అంటే కాలుష్యం అన్న రేవంత్ రెడ్డి యే ఇప్పుడు ఏ విధంగా 3 వేల ఎకరాలు తీసుకుంటున్నాడు అంటూ ప్రశ్నించారు.

జైల్లో ఇప్పుడు 16 మందిని కలిశాం, వాళ్ల బాధ చెప్పలేని విధంగా ఉందన్నారు. అందులో ఒక ప్రభుత్వ ఉద్యోగి ఉన్నారని, రేవంత్ రెడ్డి పెట్టిన కులగణన కార్యక్రమంలో ఉన్న ఉద్యోగిని సాయంత్రం దాడిలో పాల్గొన్నాడంటూ తీసుకెళ్లారని విమర్శించారు. ఇంకొక తమ్ముడు వనపర్తి లో చదువుకుంటున్నాడు. గొడవ జరిగిన విషయం తెలిసి ఇంటికి వస్తే ఆయనను కూడా జైలుకు తీసుకొచ్చారని మండిపడ్డారు.

ముందు 60, 70 మందిని అరెస్ట్ చేశారు, దాడి చేసిన వాళ్లలో కాంగ్రెస్ నాయకులే ప్రధానంగా ఉన్నారని తెలిపారు. దుద్యాల కాంగ్రెస్ అధ్యక్షుడి అనుచురులు దాడి చేశారని బాధితులు చెబుతున్నట్లు కేటీఆర్ చెప్పారు. కానీ పోలీసులకు మాత్రం రేవంత్ రెడ్డి సోదరుడు తిరుపతి రెడ్డి ఫోన్ లో డైరెక్షన్స్ ఇచ్చి వీళ్లను కొట్టించాడని వ్యాఖ్యానించారు.

ముఖ్యమంత్రి సోదరుడున్న ఒకే ఒక్క అర్హతతో తిరుపతి రెడ్డి కొడంగల్ లో రాజ్యంగేతర శక్తి గా మారాడని మండిపడ్డారు. కలెక్టర్ సహా పోలీసులు, అధికారులు ఆయన ముందు మోకరిల్లే విధంగా రారాజుగా వ్యవహరిస్తున్నాడని ధ్వజమెత్తారు. కొడంగల్ లో ముఖ్యమంత్రిది ఏమీ నడవదంట. అంతా తిరుపతి రెడ్డిదే చెల్లుతదని సంచలన వ్యాఖ్యలు చేశారు.

ఈ దాడి మొత్తం బీఆర్ఎస్ వాళ్లు మాత్రమే చేశారని చెప్పాలని కుట్ర చేస్తున్నారని ఫైర్ అయ్యారు. వాళ్ల చేతగాని తనాన్ని, అధికారులకు, ప్రభుత్వానికి జరిగిన పరాభవానికి ఏం చెప్పాలో తెలియక దీనికి రాజకీయ రంగు పులిమారని విమర్శించారు. 21 మంది రైతులు అంతా కూడా పేద ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులేనని ఆవేదన వ్యక్తం చేశారు.

మెజిస్ట్రేట్ ముందు కొట్టారని చెబితే మళ్లీ కొడతామని అమానవీయంగా వ్యవహరించారని వాళ్లు మాకు చెప్పారు. తీవ్రవాదులను పట్టుకొనేందుకు వెళ్లినట్లు డోర్లను తంతు పోలీసులు ఊర్లో భయానక వాతావారణ సృష్టించారని తెలిపారు. కొంతమంది కాంగ్రెస్ పార్టీ వాళ్లు తాగి బూతులు మాట్లాడుతూ ప్రజలపై దాడులు కూడా చేశారన్నారు.

రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ ప్రభుత్వం మీరుండేది ఐదేళ్లు మాత్రమే, అధికారం శాశ్వతమని భావించకండి అంటూ వార్నింగ్ ఇచ్చారు. నువ్వు చక్రవర్తివి కాదు, నీలాంటి చాలా మందిని చూశాం. ఢిల్లీ వాళ్లకు కోపం వస్తే నీ పదవి ఎప్పుడు ఊడుతుందో కూడా తెలియదు అని ఎద్దేవా చేశారు.

బీసీ, ఎస్సీ, ఎస్టీ రైతుల భూములు గుంజుకుంటా అంటే ఊరుకోం అని కేటీఆర్ స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి పై ఇవ్వాళ కొడంగల్ మర్లవడ్డది, రేపు తెలంగాణ మొత్తం మర్లవడుతదని తెలిపారు. కావాలంటే మమ్మల్ని జైల్లో పెడితే పెట్టు, మేము అధికారంలో వచ్చాక నిన్ను ఏం చేయాలో అది చేస్తాం అని కన్నెర్ర చేశారు. కానీ రైతులను వదిలేయాలని కోరారు.

అరెస్ట్ చేయించిన 21 మంది రైతుల కుటుంబాల ఉసురు నీకు, నీ పార్టీకి తాకుతదన్నారు. ఏ పేద ప్రజల ఓట్లతో గెలిచావో ఆ పేద ప్రజలను ఇబ్బంది పెడుతున్న నీకు వాళ్ల ఉసురు తప్పకుండా తగులుతుందని పేర్కొన్నారు.21 మంది రైతులు బయటకు వచ్చే వరకు బీఆర్ఎస్ వారికి న్యాయసాయంతో పాటు అండగా ఉంటుందని స్పష్టం చేశారు.

రాఘవేంద్ర అనే ఉద్యోగి తన ఉద్యోగం కోసం భయపడుతున్నాడు. ఆయన ఉద్యోగం పోకుండా అవసరమైతే సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్తామని చెప్పారు. తన చేతగానీ వైఫల్యాలను తప్పించుకోవటానికే రేవంత్ రెడ్డి ఈ డ్రామాలు చేస్తున్నాడని విమర్శించారు.

రూ.60, 70 లక్షలు విలువ చేసే భూమికి రూ.10 లక్షలు ఇస్తా అంటే రైతులు ఒప్పుకుంటారా? అని ప్రశ్నించారు. కేసీఆర్ ఫార్మాసిటి కోసం హైదరాబాద్ లో 14 వేల ఎకరాలు సేకరిస్తే దాన్ని వద్దని ఆ భూముల్లో రియల్ ఎస్టేట్ చేస్తున్నారని ఆరోపించారు. ఫార్మా విలేజ్ పేరుతో తన కుటుంబ సభ్యులకు భూములు కట్టబెట్టే కుట్ర సీఎం చేస్తున్నాడని సంచలన వ్యాఖ్యలు చేశారు.

You may also like
మృణాల్ ఠాకూర్ తో పెళ్లి..స్పందించిన నటుడు
‘ఆడవారి సింధూరాన్ని తుడిచారు..అందుకే’
‘మురళీనాయక్ లాంటి వీరులను కన్న తల్లులకు మదర్స్ డే అంకితం’
‘ఆపరేషన్ సింధూర్’ కొనసాగుతుంది..IAF కీలక ప్రకటన

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions