KTR Demands Justice for Toddler’s Death at Kummera Mallanna Jatara | నాగర్ కర్నూల్ జిల్లా కుమ్మెర మల్లన్న జాతరలో మృతి చెందిన చిన్నారి కుటుంబ సభ్యులను బుధవారం పరామర్శించారు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్. నాగర్ కర్నూల్ లోని అంబేద్కర్ కూడలిలో కుమ్మెర గ్రామస్థులు చేపట్టిన ధర్నాకు ఆయన మద్దతు తెలిపారు. మృతి చెందిన చిన్నారి కుటుంబ సభ్యులను కలిసిన కేటీఆర్ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. తక్షణ సాయంగా రూ.లక్ష అలాగే రూ.పది లక్షలతో ఇల్లు నిర్మిచ్చి ఇస్తానని కేటీఆర్ హామీ ఇచ్చారు. అనంతరం ఆయన మాట్లాడుతూ..పసిపాప హంతకులకు అండగా నిలబడ్డ ప్రతి ఒక్కరు ముమ్మాటికి దోషే అని స్పష్టం చేశారు.
హంతకుడు ఎవరైనా, ఏ పార్టీకి చెందిన వారైనా వారిని జైల్లో పెట్టాలని డిమాండ్ చేశారు. దాడి చేసిన 8 మంది పైన హత్యానేరం కింద కేసులు నమోదు చేసి, అరెస్ట్ చేయాలన్నారు. భాదిత కుటుంబానికి రూ.కోటి నష్ట పరిహారం అందించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పసిపాపను హత్య చేసిన హంతకులను శిక్షించి జైల్లో వేయాలని అవసరమైతే ఉరిశిక్ష వేయాలి కానీ బయటకి వదలవద్దని కేటీఆర్ పేర్కొన్నారు.










