Friday 30th January 2026
12:07:03 PM
Home > తాజా > మూకుమ్మడిగా దాడి చేస్తారు.. సిద్ధంగా ఉండండి: కేటీఆర్ సూచన!

మూకుమ్మడిగా దాడి చేస్తారు.. సిద్ధంగా ఉండండి: కేటీఆర్ సూచన!

ktr

KTR Alerts BRS Social Media | తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం (Congress Government) పాలన పూర్తిగా విఫలమైందని విమర్శించారు కేటీఆర్ (KTR). ఈ మేరకు ఆయన ఎక్స్ వేదిక ఓ కీలక పోస్ట్ చేశారు.

బీఆరెస్ శ్రేణులు రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వ వైఫల్యాలను, అవినీతిని బయటపెట్టడంతో వారు విసుగిపోతున్నారని తెలిపారు.   గత రెండు రోజులుగా జరిగింది కాంగ్రెస్ ప్రహసనం అని మండిపడ్డారు. అయితే ఇది సుదీర్ఘ రాజకీయ ప్రతీకార పోరాటానికి ప్రారంభం మాత్రమేనని కేటీఆర్ పేర్కొన్నారు.

కాంగ్రెస్ కుట్రను ఎదుర్కునేందుకు సహకరించిన BRS నాయకులు మరియు సోషల్ మీడియా కార్యకర్తలకు అభినందనలు తెలిపారు. రాబోయే రోజుల్లో వ్యక్తిగత దాడులు, కుట్రలు, తప్పుడు ప్రచారం, నిరాధార ఆరోపణలు మరింత పెరుగుతాయని తెలిపారు.

‘డీప్ ఫేక్’ (Deep Fake) టెక్నాలజీతో ఫేక్ వీడియోలను పెయిడ్ ఆర్టిస్టులతో వైరల్ చేయిస్తారని హెచ్చరించారు. కాంగ్రెస్, బీజేపీ, TDP మరియు వారి సొంత సోషల్ మీడియా BRS ను లక్ష్యంగా చేసుకుని మరిన్ని దాడులు చేస్తాయని, వాటిని ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉండాలని కేటీఆర్ బీఆరెస్ శ్రేణులకు సూచించారు. తెలంగాణ ప్రజల ప్రయోజనాల కోసం పోరాటంలోనే మన దృష్టి ఉండాలని పిలుపునిచ్చారు.

You may also like
harish rao pressemeet
రైతుల నోట్లో మట్టి కొట్టి.. బీరు ఫ్యాక్టరీలకు నీళ్లిస్తారా?
ponguleti srinivasa reddy
దేశానికే రోల్‌మోడ‌ల్‌గా తెలంగాణ డిజాస్ట‌ర్ మేనేజిమెంట్‌!
cm revanth about medaram jathara
‘మేడారం తల్లుల స్పూర్తితో ప్రభుత్వం ఏర్పడింది’
komatireddy venkat reddy
‘బొట్టుగూడ పాఠశాల నిర్మాణం నా చిరకాల కోరిక’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions