KTR About Group-1 Exam | గ్రూప్-1 పరీక్ష అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వంపై నిప్పులుచెరిగారు బీఆరెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.
సర్కారు కొలువుకోసం ఏళ్ల తరబడి కష్టపడి తమ విలువైన సమయాన్నీ, అమ్మా, నాన్నల కష్టార్జితాన్నీ ధారపోసి పోటీ పరీక్షలు రాసే తెలంగాణ యువత నమ్మకాన్ని కాంగ్రెస్ సర్కారు వమ్ముజేసిందని మండిపడ్డారు.
అసమర్ధత, కాసుల కక్కుర్తి కలగలిసి అనేక అవకతవకలకు కారణమయ్యిందని కీలక వ్యాఖ్యలు చేశారు. అంగట్లో కొలువులు అమ్ముకొని నిరుద్యోగుల గొంతుకోసిందని సంచలన ఆరోపణలు చేశారు. గ్రూప్ 1 పరీక్ష నిర్వహణలో ఫెయిల్ అయిన ఈ ప్రభుత్వాన్ని యువత ఎన్నటికీ క్షమించదన్నారు.
హైకోర్టు ఆదేశించినట్టు గ్రూప్ 1 పరీక్ష మళ్లీ తాజాగా నిర్వహించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. అవకతవకలపై జుడీషియల్ కమీషన్ వేసి ఉద్యోగాల దొంగలెవరో తేల్చాలన్నారు. ఏడాదిలోపే రెండు లక్షల ఉద్యోగాలిస్తామని కాంగ్రెస్ చేసిన మోసపూరిత వాగ్ధానంపై ప్రత్యేక అసెంబ్లీ సెషన్ ఏర్పాటు చేసి చర్చించాలని కేటీఆర్ డిమాండ్ చేశారు.










