Komatireddy Rajgopal Reddy News | ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థులకు మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి రూ.20 లక్షల నగదు బహుమతులతో సన్మానించారు.
ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడానికి, ప్రభుత్వ బడులను బ్రతికించుకోవడానికి ఈ వినూత్న కార్యక్రమం చేపట్టినట్లు పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రంలోనే ఏ ఎమ్మెల్యే చేయలేని విధంగా ప్రభుత్వ బడుల్లో చదివే విద్యార్థిని విద్యార్థులకు చేయూత అందించినట్లు తెలిపారు.
2024-2025 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ పాఠశాలలో పదవ తరగతి పరీక్షల్లో మొదటి స్థానం ద్వితీయ స్థానం తృతీయ స్థానం సాధించిన విద్యార్థులను సన్మానించి నగదు బహుమతి, ప్రతిభ పురస్కారాల ప్రధానం చేశారు.
మొదటి స్థానం సాధించిన వారికి రూ.15000, ద్వితీయ స్థానం సాధించిన వారికి రూ.10000, తృతీయ స్థానం సాధించిన వారికి రూ.7500 నగదు బహుమతి అందజేశారు. మునుగోడు నియోజకవర్గ వ్యాప్తంగా 62 ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 189 విద్యార్థినీ విద్యార్థులను సన్మానించి, ప్రతిభ పురస్కారంతోపాటు నగదు బహుమతిని అందించారు.