Kollywood Warns Rajendraprasad | టాలీవుడ్ నటుడు రాజేంద్రప్రసాద్ (Rajendraprasad) తమిళ నటుడు, మాజీ ముఖ్యమంత్రి ఎంజీ రామచంద్రన్ (MG Ramachandran) పై చేసిన వ్యాఖ్యలు వివాదంగా మారాయి. ఈ నేపథ్యంలో నటుడు విశాల్ స్పందిస్తూ రాజేంద్రప్రసాద్ వ్యాఖ్యలు తనతో పాటు లక్షలాది మందని బాధించాయని పేర్కొన్నారు.
ఈ మేరకు ఎక్స్ వేదికగా ఒక పోస్ట్ చేశారు. ఇటీవల ఓ కార్యక్రమంలో పాల్గొన్న రాజేంద్రప్రసాద్ లెజెండరీ యాక్టర్ కాంతారావును ప్రశంసించే క్రమంలో ఎంజీఆర్ పై చేసిన కామెంట్స్ కాంట్రావర్సీకి దారి తీశాయి. కాంతరావును చూసి ఎంజీఆర్ భయపడేవారిని రాజేంద్రప్రసాద్ చెప్పారు.
ఈ క్రమంలో విశాల్ స్పందిస్తూ..రాజేంద్ర ప్రసాద్ చేసిన వ్యాఖ్యలు విని షాక్‌కు గురయ్యామని విశాల్ తన ట్వీట్‌లో పేర్కొన్నారు.
దిగ్గజ నటుడు కాంతారావుని ప్రశంసించడం అభినందనీయం అయినప్పటికీ, అదే సందర్భంలో తమిళ సినీ చరిత్రలో చెరగని ముద్ర వేసిన, నటుడిగా మాత్రమే కాక నాయకుడిగా కూడా ప్రజల హృదయాల్లో నిలిచిపోయిన ఎం.జి. రామచంద్రన్ పై చేసిన వ్యాఖ్యలు ఎంతోమంది భావోద్వేగాలను గాయపరిచాయని విశాల్ ఆవేదన వ్యక్తం చేశారు.
ఒక లెజెండ్‌ను పొగడటం కోసం మరో లెజెండ్‌ను తక్కువ చేయడం సరికాదని, ఈ అంశంపై తగిన స్పందన, స్పష్టత లేదా క్షమాపణ అవసరమని ఆయన ట్వీట్‌లో కోరారు. మంచి ఉద్దేశంతో, సానుకూల పరిష్కారం ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు.










