Kolkata Doctor Rape-Murder Case | దేశవ్యాప్తంగా కలకలం రేపిన కోల్కత్త ( Kolkata ) ట్రైనీ డాక్టర్ హత్యాచార ( Doctor Rape-Murder Case )ఘటనలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.
ఈ కేసులో ప్రధాన నిందితుడైన సంజయ్ రాయ్ ( Sanjay Roy ) కి సీబీఐ పాలి గ్రాఫ్ ( Polygraph Test ) టెస్టును నిర్వహించింది. నిందితుడు ఉన్న కోల్కత్త ప్రెసిడెన్సీ జైల్లో లై డిటెక్టర్ టెస్టును నిర్వహించారు. అయితే సంజయ్ రాయ్ ఎం చెప్పాడు అనే వివరాలను సీబీఐ గోప్యంగా ఉంచింది.
కానీ టెస్టులో భాగంగా సంజయ్ రాయ్ పొంతన లేని సమాధానాలు చెప్పినట్లు జాతీయ మీడియా ( National Medai )లో కథనాలు వస్తున్నాయి. తాను సెమినార్ హాల్ కు వెళ్లే సమయానికే డాక్టర్ చనిపోయినట్లు, ఆ భయంతో తాను అక్కడి నుండి పరుగులు తీసినట్లు నిందితుడు తెలిపినట్లు తెలుస్తోంది.
కాగా హత్యాచార ఘటన తర్వాతి రోజు అఘాయిత్యానికి పాల్పడింది తానే అంటూ నిందితుడు ఒప్పుకున్నట్లు కథనాలు వచ్చాయి. ఆ తర్వాత కోర్టులో మాత్రం తాను అమాయకుడ్ని అని, తనను ఇరికించారని సంజయ్ రాయ్ కన్నీరు పెట్టుకున్నారు. ఈ పరిణామాల నేపథ్యంలో కేసు మరింత గందరగోళంగా మారింది.