Monday 5th May 2025
12:07:03 PM
Home > తాజా > పట్నం నరేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!

పట్నం నరేందర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు!

Patnam Narender Reddy Comments | వికారాబాద్ (Vikarabad) జిల్లా దుద్యాల మండలం లగచర్ల (Lagacharla) గ్రామంలో అధికారులపై దాడి జరిగిన ఉదంతంలో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేసి జైలుకు తరలించిన విషయం తెల్సిందే.

ప్రభుత్వాన్ని అస్థిర పరిచేందుకు కేటీఆర్ ఆదేశాలతో కుట్ర పన్నారని అభియోగాలు వస్తున్నాయి. కాగా తనను అరెస్ట్ చేయడంపై పట్నం నరేందర్ కీలక వ్యాఖ్యలు చేశారు.

‘ఎన్ని కుట్రలు కుతంత్రాలు చేసి జైల్లో వేసిన ఎంత అణగదొక్కాలని చూసిన అంతా పైకి లేస్తాం ప్రజల తరపున రైతుల తరపున కెసిఆర్ స్ఫూర్తితో పొరడతాము.

కొడంగల్ లో పార్మా నిర్మాణం విరమించే దాకా నిరంతం ప్రజల తరఫున బిఆర్ఎస్ పార్టీ తరపున కొట్లడుతాము ‘ అని ఆయన స్పష్టం చేశారు. అలాగే తన అక్రమ అరెస్టుకు కొడంగల్ ప్రజలు,రైతులు అభిమానులు యువకులు ఎవ్వరూ ఆందోళన చెందవద్దని పిలుపునిచ్చారు.

కేసులకు అరెస్టులకు భయపడే వాళ్ళము కాదు మనము కెసిఆర్ సైనికులం’ అంటూ పట్నం నరేందర్ ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు.

You may also like
‘వరుసగా ఆరు సిక్సర్లు..వైరల్ గా మారిన పరాగ్ గత ట్వీట్’
‘ఐఏఎస్, ఐపీఎస్ లపై ఆరోపణలు..నా అన్వేషణ పై పోలీస్ కేసు’
‘పదిలో ఫెయిల్..తల్లిదండ్రులు చేసిన పనికి సర్వత్రా ప్రశంసలు’
పాక్ ఆర్మిపై విరుచుకుపడుతున్న బలోచ్ ‘డెత్ స్క్వాడ్’

Leave a Reply

Skip to toolbar

Designed & Developed By KBK Business Solutions