Key leadership changes in telugu states
అందరూ అనుకున్నట్టుగానే తెలంగాణ రాష్ట్రంలో అధ్యక్ష మార్పు జరగనుంది.
బండి సంజయ్ స్థానంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి తెలంగాణ బీజేపీ అధ్యక్ష పగ్గాలు చేపట్టనున్నారు.
అలాగే ఆంధ్రప్రదేశ్ లో సోము వీర్రాజు స్థానంలో పురందేశ్వరికి ఛాన్స్..
సాయంత్రమే అధికారిక ప్రకటన…!
తెలంగాణ| గత కొద్దిరోజులుగా తెలంగాణ బీజేపీ అధ్యక్ష మార్పు ఉండబోతుందని వార్తలు వస్తున్నాయి.
దాన్ని నిజం చేస్తూ ఈరోజు బీజేపీ అధిష్టానం నిర్ణయం తీసుకోబోతున్నట్లు ఢిల్లీ నుండి కథనాలు వస్తున్నాయి.
ప్రస్తుత కేంద్ర పర్యాటక శాఖ మంత్రి , సికింద్రాబాద్ ఎంపీ జి. కిషన్ రెడ్డిని తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షునిగా నియమించనున్నట్లు సమాచారం.
అలాగే ఇన్నిరోజులు పార్టీ కోసం కృషి చేసిన బండి సంజయ్ కు కేంద్రంలో స్థానం కల్పించనున్నట్లు వార్తలు వస్తున్నాయి.
గత కొద్దిరోజులుగా తెలంగాణ బీజేపీ సమస్యలతో సతమతమవుతుంది.దానికి ప్రధాన కారణం పార్టీలోని నాయకులు వివిధ గ్రూపులుగా విడిపోయి ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటున్నారు.
బండి సంజయ్ అందరిని కలుపుకొని పోవడం లేదని ఏక పక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని పలువురు నాయకులు విమర్శలు గుప్పిస్తున్నారు.
అందులో భాగంగానే కిషన్ రెడ్డి ని నియమించడం ద్వారా అందరిని కలుపుకొని పోవడం ద్వారా పార్టీ బలపడుతుంది అని అధినాయకత్వం భావిస్తున్నట్లు సమాచారం.అలాగే కిషన్ రెడ్డి సీనియర్ నేత, ప్రారంభం నుండి పార్టీకి విధేయుడిగా ఉండటం, బీజేపీ సిద్ధాంతాలను ప్రజల్లోకి తీసుకువెళ్తాడాని వారి అభిప్రాయం.
మరికొన్ని నెలల్లో ఎన్నికలు ఉన్న తరుణంలో కిషన్ రెడ్డిని నియమించడం ద్వారా పార్టీలోని నాయకులు సమష్టిగా విబేధాలు లేకుండా ఎన్నికల్లో తమ పార్టీని విజయతీరాలకు చేరిస్తాడాని అధినాయకత్వం విశ్వసిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
బండి సంజయ్ అధ్యక్షుడిగా ఎన్నికైన నుండి పార్టీని పరుగులు పెట్టించి తెలంగాణలో బీజేపీని బలపరిచాడు. బండి తగిన గౌరవాన్ని ఇవ్వాలనే ఉద్దేశం తక్ ఆయన్ని కేంద్ర క్యాబినెట్లోకి ఆహ్వానించనున్నారు.
అలాగే బీజేపీలోని ఇతర నాయకులు ముఖ్యంగా ఈటెల రాజేందర్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, రఘునందన్ రావు లకు కూడా వివిధ పదువులు ఇవ్వనున్నట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్| ఆంధ్రప్రదేశ్ ప్రస్తుత బీజేపీ అధ్యక్షులు గా ఉన్న సోము వీర్రాజు ను తప్పుకోమని స్వయంగా జేపీ నడ్డా ఫోన్ చేసి చెప్పినట్లు సోము వీర్రాజు వ్యాఖ్యానించారు.ఆయన స్థానంలో మాజీ కేంద్రమంత్రి పురందేశ్వరిని నియమించనున్నట్లు సమాచారం.