KCR News Latest | మాజీ ముఖ్యమంత్రి, బీఆరెస్ అధినేత కేసీఆర్ వైద్య పరీక్షల నిమిత్తం యశోద ఆసుపత్రిలో చేరిన విషయం తెల్సిందే.
ఈ నేపథ్యంలో ఆయన్ను పరామర్శించేందుకు పలువురు నేతలు వెళ్లారు. ఈ సందర్భంగా నేతలతో కేసీఆర్ ఇష్టాగోష్టి నిర్వహించారు.
రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితులు, రైతులకు యూరియా ఎరువుల లభ్యత, వ్యవసాయం, సాగునీరు, తదితర ప్రజా సమస్యలు.. వర్తమాన అంశాలపై వారితో సుదీర్ఘంగా చర్చించినట్లు బీఆరెస్ పార్టీ తెలిపింది. అనంతరం పార్టీ నేతలు, ఉద్యమకారుల నుంచి కేసీఆర్ ఫీడ్ బ్యాక్ తీసుకున్నారని వెల్లడించింది.