- హలో ఎంట్రప్రెన్యూర్స్ 40 అండర్ 40 జాబితాలో చోటు
- వివిధ రంగాల్లో విశేష సేవలు అందిస్తున్న వారితో జాబితా
- మా బాధ్యత మరింత పెరిగింది: భరత్ కుమార్
Dr KBK Features in 40 Under 40 | ఐటీ, డిజిటల్ మార్కెటింగ్, హాస్పిటల్, మీడియా తదితర రంగాల్లో విశేష సేవలందిస్తున్న కేబీకే గ్రూప్ (KBK Group) అధినేత డాక్టర్ కక్కిరేణి భరత్ కుమార్ (Kakkireni Bharath Kumar)కు మరో అరుదైన ఘనత దక్కింది.
భారతదేశంలోని ప్రముఖ ఇ-బిజినెస్ మ్యాగజైన్ హలో ఆంత్రప్రెన్యూర్స్ (Hello Entrepreneurs) ప్రకటించిన “40 అండర్ 40” (40 Under 40) జాబితాలో డాక్టర్ భరత్ కుమార్ కు చోటు దక్కింది. ఇటీవల ప్రకటించిన ఈ జాబితాలో దేశంలోని అనేక రంగాలలో ప్రకాశవంతమైన 40 ఏళ్లలోపు యువ ప్రతిభావంతులను ఎంపిక చేశారు.
ఈ సందర్భంగా డాక్టర్ భరత్ కుమార్ మాట్లాడుతూ హలో ఆంత్రప్రెన్యూర్స్ 40 అండర్ 40 జాబితాలో చోటు దక్కడం చాలా సంతోషంగా ఉందన్నారు. తమ సంస్థల ద్వారా ఐటీ, డిజిటల్ మార్కెటింగ్ తో పాటు కేబీకే హాస్పిటల్ (KBK Hospital) ద్వారా గ్యాంగ్రీన్ (Gangrene), డయాబెటిక్ ఫుట్ అల్సర్స్ (Diabetic Foot Ulcers), సెల్యూలైటిస్ (Cellulites) లాంటి షుగర్ సంబంధిత వ్యాధులకు ప్రపంచంలోనే ఎక్కడే లేని విధంగా ఆంప్యుటేషన్ రహిత చికిత్సను అందిస్తున్నట్లు వెల్లడించారు. తాజాగా లభించిన గుర్తింపుతో తమపై మరింత బాధ్యత పెరిగిందని తెలిపారు.
అనంతరం హలో ఆంత్రప్రెన్యూర్స్ మ్యాగజీన్ ఎడిటర్ విరాంగ్ భట్ మాట్లాడుతూ “40 అండర్ 40’ జాబితాను ఆవిష్కరించడం తమకు చాలా ప్రత్యేకమైందన్నారు. ప్రఖ్యాత నటీనటుల నుండి దూరదృష్టి గల స్టార్టప్‌లు మరియు ఇతర సంస్థల వరకు ఈ 40 మంది 40 ఏళ్లలోపు వ్యక్తులు అందరూ వారి రంగాలలో విశేషమైన సేవలు అందిస్తున్నారని తెలిపారు. ఈ యువ సాధకుల వ్యాపార ప్రయాణం మరింత మంది యువ ఎంట్రప్రెన్యూర్ లకు స్ఫూర్తినిస్తుందని తెలిపారు.
కేబీకే గ్రూప్ అధినేత భరత్ కుమార్ తో పాటు 40 అండర్ 40 జాబితాలో చోటు దక్కిన ప్రముఖులు:
తాప్సీ పన్ను – నటి మరియు వ్యాపారవేత్త
రితేష్ అగర్వాల్ – OYO వ్యవస్థాపకుడు
పెయుష్ బన్సల్ – లెన్స్‌కార్ట్ వ్యవస్థాపకుడు
గజల్ అలఘ్ – హోనాస కన్స్యూమర్ ప్రైవేట్ లిమిటెడ్ సహ వ్యవస్థాపకుడు
ఇషా అంబానీ – డైరెక్టర్, రిలయన్స్ రిటైల్
అరుణ్ కుమార్ తివారీ – ఆస్ట్రో వ్యవస్థాపకుడు అరుణ్ పండిట్
కరణ్ అదానీ – APSEZ యొక్క CEO మరియు MD
నితిన్ సలూజా – చాయోస్ సహ వ్యవస్థాపకుడు
రితేష్ మాలిక్ – ఇన్నోవ్8 వ్యవస్థాపకుడు
రుషబ్ షా – జీవరాజ్ టీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్.
ధ్రువ్ లూథ్రా – లూత్రా గ్రూప్ మేనేజింగ్ డైరెక్టర్
అథర్వ బహదూర్ – దృష్టి ప్యూర్స్ యొక్క CEO
కల్పేష్ గోటి – గ్రీన్లీఫ్ ఎన్విరోటెక్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్
దివ్యాన్ష్ సెంగార్ – డామింటర్స్ బిజినెస్ ట్రైబ్ వ్యవస్థాపకుడు & CEO
డాక్టర్ హర్షమీత్ అరోరా – ఆరోగ్యకరమైన మరియు అందమైన జీవనశైలి
చిరగ్‌కుమార్ లింబసియా – భత్వారీ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్
సంకేత్ పటేల్ – గ్రీన్‌ల్యాబ్ డైమండ్స్ డైరెక్టర్
రోహిత్ సింగ్ – OyeRohit వ్యవస్థాపకుడు
డాక్టర్. సాహిల్ లాల్ – మెట్రో హాస్పిటల్స్ డైరెక్టర్
డాక్టర్. మిలింద్ ఘేల్ – అఖండ భారత్ అఖండ్ హెల్త్‌కేర్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు & అధ్యక్షుడు
నైతిక్ షా – AURA హియరింగ్ కేర్ ప్రైవేట్ లిమిటెడ్ మేనేజింగ్ డైరెక్టర్
షాదాబ్ నగాని – ఈకామర్స్ డైరెక్టర్, SSIZ ఇంటర్నేషనల్ ప్రైవేట్ లిమిటెడ్.
సుభాజిత్ ఛటర్జీ – ఆన్‌లైన్ సిండ్రోమ్ వ్యవస్థాపకుడు
ప్రతీక్ తోష్నివాల్ – MICS ఇంటర్నేషనల్ DMCC, UAE భాగస్వామి
డాక్టర్ రాధికా గుప్తా – డాక్టర్ రాధికా గుప్తా డెంటల్ & ఈస్తటిక్ క్లినిక్ వ్యవస్థాపకురాలు
సుధీర్ కోవ్ – సుధీర్ కోవ్ ట్రాన్స్ఫర్మేషన్ వ్యవస్థాపకుడు & CEO
డాక్టర్ మేఘా నాగ్‌పాల్ – మెలోకేర్ వెల్‌నెస్ డైరెక్టర్
శ్వేతా సలుంఖే – కాఫీ మరియు మరిన్నింటికి మేనేజింగ్ డైరెక్టర్ (గ్లోకల్ ఫుడ్‌వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్)
నాగమల్ల వెంకటేష్ గుప్తా – SVSJ ఇన్‌ఫ్రా డెవలపర్స్ వ్యవస్థాపకుడు మరియు చైర్మన్
మోక్షేష్ జోటా – జోటా హెల్త్‌కేర్ లిమిటెడ్ డైరెక్టర్
మహమ్మద్ ముదబ్బీర్ – ONNEXT ఇంటీరియో మేనేజింగ్ డైరెక్టర్
విశేష్ అశుఖేరా – హర్మిలాప్ మీడియా ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్
చమ్కీ బోస్ – మైండ్‌ట్రైబ్ హెల్త్‌కేర్ యొక్క మనస్తత్వవేత్త
శంఖదీప్ మోండల్ – Deep93Foodtech Llp వ్యవస్థాపకుడు మరియు CEO
మణిధర్ అనుముల – సీఈఓ & ఆర్ట్‌సెన్ లివింగ్ సహ వ్యవస్థాపకుడు
పతిక్ షా – జీవరాజ్ టీ లిమిటెడ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్.
క్రాంతి కుమార్ – ట్రైడ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు
సచిన్ సలుంఖే – బ్లాక్‌హాట్ సిండికస్ ఛైర్మన్ అర్పి రెడ్డి మాధవ్ రెడ్డి – ట్రైడ్ ఇన్నోవేటివ్ టెక్నాలజీస్ ప్రైవేట్ లిమిటెడ్ వ్యవస్థాపకుడు మరియు CEO